కవిత గెలుపు.. అతివిశ్వాసం కొంపముంచనుందా?

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తాజాగా జరిగింది. ఈ ఎన్నికలో సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా పోటీచేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్సీగా ఆమె గెలుపొందడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆమె మళ్లీ అడుగుపెట్టారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్.. బీజేపీకి డిపాజిట్లు కూడా రాకపోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నాయి. Also Read: కవితమ్మ గెలుపు కుటుంబస్వామ్యమా? ప్రజాస్వామ్యమా? నిజామాబాద్లో కవిత గెలుపు టీఆర్ఎస్ శ్రేణుల్లో అత్యుత్సాహాన్ని […]

Written By: NARESH, Updated On : October 14, 2020 10:20 am
Follow us on

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తాజాగా జరిగింది. ఈ ఎన్నికలో సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా పోటీచేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్సీగా ఆమె గెలుపొందడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆమె మళ్లీ అడుగుపెట్టారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్.. బీజేపీకి డిపాజిట్లు కూడా రాకపోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నాయి.

Also Read: కవితమ్మ గెలుపు కుటుంబస్వామ్యమా? ప్రజాస్వామ్యమా?

నిజామాబాద్లో కవిత గెలుపు టీఆర్ఎస్ శ్రేణుల్లో అత్యుత్సాహాన్ని నింపినట్లు కన్పిస్తోంది. నిజామాబాద్ మాదిరిగానే త్వరలోనే దుబ్బాక జరిగే ఉప ఎన్నికలోనూ.. జీహెచ్ఎంసీ ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని నేతలు భావిస్తున్నారు. అయితే నిజామాబాద్ గెలుపునకు దుబ్బాక ఎలక్షన్.. జీహెచ్ఎంసీలకు ఏమాత్రం పోలికలేదని విషయాన్ని మరిచి టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.

నిన్న జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్లుగా సర్పంచులు.. వార్డుమెంబర్లు.. మున్సిపల్ కౌన్సిలర్లు.. ఎంటీటీసీలు.. జెడ్పీటీసీలు ఉంటాయి. 2014, 2018లో జరిగిన ఆయా ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు కైవలం చేసుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో వారంతా కూడా టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేసే అవకాశం ఉంటుంది. అందువల్లే కవిత గెలుపు వన్ సైడ్ వార్ గా సాగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: తెలంగాణ సాగుకు కేసీఆర్ కొత్త ఒరవడి

ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో టీఆర్ఎస్ నేతలంతా కవిత గెలుపును ఆదర్శంగా తీసుకుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో నేతలు భంగపడక తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్లో కవిత గెలుపు ఏమాత్రం ప్రజామోదం కాదని.. దీనిని టీఆర్ఎస్ నేతలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని.. లేకుంటే బొక్కబొర్లాపడక తప్పదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.