Most Expensive Divorce: దుబాయి రాజు మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం (72) తన మాజీ భార్య జోర్డాన్ రాకుమారి హయా బింత్ అల్ హుసేన్ (47) కు భారీ భరణం చెల్లించాలని బ్రిటన్ కోర్టు తీర్పు వెలువరించింది. రాకుమారి వారి పిల్లలకు రూ. 5555 కోట్లు కట్టాలని తీర్పు చెప్పింది. బ్రిటిష్ దేశ చరిత్రలో ఇదే అత్యధిక విడాకుల సర్దుబాటు వ్యవహారం అని తెలుస్తోంది. దీంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇంత భారీ మొత్తంలో పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పడంతో అందరు కంగారు పడ్డారు.

ఇందులో రూ.2,521 కోట్లు మాజీ భార్యకు మూడు నెలల్లోపు చెల్లించాలని సూచించింది. రూ. 2,907 కోట్లు పిల్లలైన అల్ జలీనా (14, జయేద్ (9) లకు బ్యాంకు గ్యారంటీతో చెల్లించాలని ఆదేశించింది. పిల్లలకు ఇవ్వాల్సిన మొత్తం తండ్రితో వారికున్న సంబంధాలపై ముడిపడి ఉంటుందని చెప్పడం గమనార్హం.
మాజీ భార్య పిల్లలకు మైనార్టీ తీరేదాకా రక్షణ వ్యయం కింద రూ. 110 కోట్లు, వారి చదువుకు ఇంకా కొంత డబ్బు కలపాలని చెప్పింది. రాకుమారి హయా 2019 ఏప్రిల్ లో దుబాయి నుంచి లండన్ కు తిరిగి వచ్చి విడాకులు కావాలని బ్రిటిష్ కోర్టును ఆశ్రయించింది. జోర్డాన్ రాజు దివంగత హుసేన్ కుమార్తె అయిన హయా తన భర్తతో ముప్పు ఉందని వేడుకుంది.
Also Read: Panama Papers leak: పనామా పేపర్స్ లీక్ కేసులో ఐశ్యర్య తర్వాత ఈడీ ముందుకు వచ్చేది వీరే…
ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైన హయా 2000 నాటి సిడ్నీ ఒలింపిక్స్ లో షో జంపింగ్ విభాగంగా పోటీ పడినట్లు తెలుస్తోంది. అయితే హయాపై అనుమానంతో రాజు ఇజ్రాయెల్ కు చెందిన పెగసస్ స్పైవేర్ సాయంతో హ్యాకింగ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీన్ని షేక్ మహమ్మద్ మాత్రం ఖండించారు. ఇందులో నిజం లేదని చెప్పారు.