Panama Papers Leak: పనామా పేపర్స్ లీక్.. దేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్ ఈ అంశం పెనుదుమారమే లేపింది. ఇండియాతో సహా వివిధ దేశాల్లోని ప్రముఖ వ్యాపార వేత్తలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కొందరు దేశాధినేతలు కూడా పన్ను చెల్లించకుండా అక్రమంగా యూకేలోని వర్జిన్ ఐ ల్యాండ్స్‌లో గల షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ‘పనామా పేపర్స్’ లీక్ చేసిన విషయం తెలిసిందే.
ఈ అక్రమ వ్యవహారంలో ఇండియాకు చెందిన కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారని, వారి పేర్లు బయటకు రివీల్ కావడంతో దేశంలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అలర్ట్ అయ్యింది. ఎవరెవరి పేర్లు పనామా పేపర్స్‌లో ఉన్నాయో వారికి ఈడీ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. తాజాగా నటి ఐశ్వర్యరాయ్ పలు వాయిదాల తర్వాత ఈడీ విచారణకు హాజరైంది. విదేశాల్లో అక్రమ పెట్టుబడుల అభియోగాల నేపథ్యంలో ఈడీ విచారణ చేపట్టింది.
మీడియాలో పలు సంచలనాల కథనాలకు కారణమైన పనామా పేపర్స్ విషయంలో ఈడీ నేటికి విచారణ జరుపుతోంది.ఈ క్రమంలోనే నటి ఐశ్వర్యరాయ్ తాజాగా విచారణకు హాజరైంది. దాదాపు 6 గంటల పాటు ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే, ఆమె నుంచి అధికారులు ఏయే విషయాలు రాబట్టారు అనే విషయాలు బయటకు రాలేదు. ఒక్క ఐశ్వర్య రాయ్ మాత్రమే కాకుండా మరికొంత బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు కూడా పనామా పేపర్స్‌లో వచ్చిన విషయం తెలిసిందే.
Also Read: Director Deva Katta: రిపబ్లిక్ 2 సినిమా స్టోరీ ఆయన కోసమే రెడీ చేస్తున్న: దర్శకుడు దేవకట్టా
ఐశ్వర్య రాయ్ మామయ్య అమితాబ్ బచ్చన్ పేరు కూడా పనామా పేపర్స్‌లో వచ్చింది. త్వరలోనే అమితాబ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ కూడా ఈడీ ముందుకు రావాల్సి ఉంటుందని సమాచారం. ఈ వార్తలపై బిగ్ బీ గతంలోనే స్పందించి ఖండించారు. మరో హీరో అజయ్ దేవగణ్ కూడా ఈ వ్యవహారాల్లో విచారణకు హాజరు కావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. అజయ్ దేవగణ్ గతంలోనే బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో గల తన పెట్టుబడులకు సంబంధించి స్పందించారు. తాను పెట్టిన పెట్టుబడులు అన్నీ సక్రమంగానే జరిగాయని అక్రమం కాదని చెప్పుకొచ్చారు.
Also Read: Srinu Vaitla: పాత సినిమాల సమ్మేళనమే నిజమైతే ఇక శ్రీనువైట్ల కష్టమే