అఫ్గనిస్తాన్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఈ తతంగం జరిగి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. యెమెన్ మిలటరీ బేస్ పై గుర్తు తెలియని వ్యక్తులు వరుస దాడులు చేశారు. మిస్సైళ్లు ప్రయోగించారు. ఇందులో 60 మందికి పైగా మరణించారు. హౌతీ ఈ దాడులకు పాల్పడిందని తెలుస్తోంది. దీనికి కూడా ఎవరు బాద్యులనే విషయం ప్రకటించుకోలేదు. దీంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి. ఎవరి పని అయి ఉంటుందో తెలుసుకోలేకపోతున్నారు.
యెమెన్ సరిహద్దులకు అతి సమీపంలో ఉండడం వల్ల హౌతీ తిరుగుబాటు దారులే అభా విమానాశ్రయంపై డ్రోన్లతో బాంబు దాడులకు తెగబడ్డారని అనుమానిస్తున్నారు. యెమెన్ సైనిక బలగాలకు సౌదీ అరేబియా అండగా ఉంటోందనే కారణంతోనే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
2014 నుంచి హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తోంది. తాజాగా అఫ్గనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ చెలరేగిపోతున్నారని తెలుస్తోంది. తిరుగుబాటుదారులను అణచివేయడానికి యెమెన్ ప్రభుత్వానికి సైనిక బలగాలను సౌదీ అరేబియా సహకారం అందిస్తోంది. దీంతో దీనికి ప్రతీకారంగానే యెమెన్ తిరుగుబాటుదారులు సరిహద్దులకు ఆనుకుని ఉన్న అభా విమానాశ్రయంప బాంబు దాడికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.