Dress Code Medical Students In AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు కోణాల్లో నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం ఈ మేరకు విద్యార్థినుల వేషధారణ విషయంలో కఠిన నిర్ణయాలు అమలు చేయాలని చూస్తోంది. దీంతో విమర్శలు ఎదుర్కొంటోంది. అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున గోల వస్తున్నా పట్టించుకోవడం లేదు. వైద్య విద్య నేర్చుకునే విద్యార్థిని విద్యార్థులు తాము చెప్పినట్లుగా నడుచుకోవాలని సూచిస్తోంది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు చేస్తోంది.

వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు జీన్స్ ప్యాంట్లు టీ షర్టులు విధించకూడదని రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. మెడిసిన్ విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు చీర లేదా చుడీదార్ మాత్రమే ధరించాలని నిబంధనలు విధించింది. అమ్మాయిలు జుట్టు వదిలేయకూడదని సూచించింది. అబ్బాయిలు గడ్డం చేసుకుని ఉండాలని తేల్చింది. ఎంబీబీఎస్ విద్యార్థులు మంచి దుస్తులు ధరించాలని చెబుతోంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల్లో అనుమానాలు వస్తున్నాయి. అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటి అనే కోణంలో ఆలోచిస్తున్నారు. నిబంధనల పేరుతో విద్యార్థులను చిన్న పిల్లలుగా చిత్రీకరించే ఇలాంటి నిర్ణయాలు సరైనవి కావనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది. ఇందులో ఉన్న మర్మమేమిటి? విద్యార్థులు ఎందుకు జీన్స్, టీ షర్టులు వేసుకోకూడదనే దానిపై స్పష్టత లేదు.

ఇదేం ఆచారం బాబూ అని విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. విద్యార్థుల బట్టలపై ఇలా కఠినమైన రూల్స్ తేవడంపై ఆగ్రహం పెరుగుతోంది. ఏపీలో ప్రభుత్వం ఇలా చేయడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన విధంగా వారు ప్రవర్తించుకోవచ్చని తెలిసినా ప్రభుత్వం ఇలా నిబంధనల పేరుతో అడ్డుకోవడం దారుణమని విద్యార్థులు వాపోతున్నారు. భవిష్యత్ లో ఇంకా ఏం నిబంధనలు విధిస్తారో కూడా తెలియడం లేదు. వైద్య విద్యార్థులు మేజర్లయినా వారిని పిల్లలుగా చూడటం సమంజసంగా లేదని చెబుతున్నారు. దీనిపై అందరి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.