https://oktelugu.com/

సోషల్‌ మీడియా, ఓటీటీల హవాకు కేంద్రం బ్రేక్‌

భారత్‌లో సోషల్‌ మీడియా.. ఓటీటీల హవా ఎప్పటి నుంచో జోరుగా నడుస్తోంది. ఎప్పుడైతే కరోనా వచ్చిందో వీటి ప్రభావం మరింత పెరిగింది. ఇక ఇప్పుడు వీటిని కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఇప్పుడు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తోంది. ఇవి అమల్లోకి వస్తే సోషల్‌ మీడియా గ్రూపులు, యాప్‌లతోపాటు ఓటీటీల్లో పెట్టే సమాచారానికి అసలు బాధ్యులెవరో నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. తమను సంప్రదించకుండా కేంద్రం దూకుడుగా ముందుకెళ్లడంపై ఆయా […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 24, 2021 / 04:12 PM IST
    Follow us on


    భారత్‌లో సోషల్‌ మీడియా.. ఓటీటీల హవా ఎప్పటి నుంచో జోరుగా నడుస్తోంది. ఎప్పుడైతే కరోనా వచ్చిందో వీటి ప్రభావం మరింత పెరిగింది. ఇక ఇప్పుడు వీటిని కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఇప్పుడు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తోంది. ఇవి అమల్లోకి వస్తే సోషల్‌ మీడియా గ్రూపులు, యాప్‌లతోపాటు ఓటీటీల్లో పెట్టే సమాచారానికి అసలు బాధ్యులెవరో నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. తమను సంప్రదించకుండా కేంద్రం దూకుడుగా ముందుకెళ్లడంపై ఆయా సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి.

    Also Read: దిశ రవికి బెయిల్ : దేశంలో ఉండాలంటే బానిస బతుకులు తప్పవా..?

    విస్తృతమైన జనాభా, మార్కెట్‌ కలిగిన భారత్‌లో సెన్సార్ లేని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌, ఓటీటీల ద్వారా అభ్యంతరకర మెస్సేజ్‌లు జనంలోకి చేరుతున్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అనుచితమైన కార్యక్రమాలు, వీడియోల ద్వారా విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోషల్‌ మీడియా ముసుగులో అసలు మీడియా కంటే ఎక్కువగా సమాచార వ్యాప్తి జరుగుతున్న తరుణంలో వీటిపై నియంత్రణ లేకుండా పోయింది. తాజాగా చోటుచేసుకున్న రైతు నిరసనలు, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో తక్షణం వీటిపై నియంత్రణ విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు త్వరలో ఓ ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.

    సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను నియంత్రించాలంటే ఇప్పుడున్న చట్టాలు సరిపోవు. అందుకే.. ఐటీ చట్టంలో భారీ మార్పులు చేయడం ద్వారా వీటిపై నియంత్రణ సాధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అమల్లోకి తెచ్చే కొత్త నిబంధనల పరిధిలోకి సోషల్ మీడియా సంస్థలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌, ఇంటర్నెట్‌ ప్రొవైడర్లు, ఇతర భాగస్వాములను కూడా తీసుకురానున్నారు.

    Also Read: జూబ్లీహిల్స్ లో ఆ ప్రాంతంలో కొత్త ఇల్లు కొన్న బాలక్రిష్ణ.. ఎన్ని కోట్లంటే?

    మరోవైపు.. తమను నియంత్రించేందుకు కేంద్రం తీసుకొస్తున్న కొత్త నిబంధనలపై సోషల్‌ మీడియా సంస్థలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ఇంటర్నెట్ కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా కేంద్రం ముందుకెళ్తోందని ఆరోపిస్తున్నాయి. దీంతో కేంద్రం విడుదల చేయాల్సిన నిబంధనల ప్రకటన ఆలస్యమవుతోంది. గత వారమే ఈ ప్రకటన వెలువడాల్సి ఉన్నా వీరి అభ్యంతరాలతో ఈ వారానికి వాయిదా పడింది. మరో రెండు రోజుల్లో కేంద్రం నుంచి కొత్త నిబంధనలపై ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్