మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా ఉచిత టీకా.. ఎవరికంటే?

కేంద్ర ప్రభుత్వం మరో మహా క్రతువుకు ఉపక్రమించింది. ఇప్పటికే దేశంలో రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. మొదట దేశంలో వైద్యులు, సిబ్బందికి టీకాలను ఉచితంగా కేంద్రం అందించింది. ఇప్పుడు మరోసారి ఉచితంగా టీకా పంపిణీకి సిద్ధమైంది. తాజాగా కేంద్ర కేబినెట్ బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ధీర్ఘకాలిక వ్యాధులు కలిగిన 45 ఏళ్లు దాటిన వారికి […]

Written By: NARESH, Updated On : February 24, 2021 4:48 pm
Follow us on

కేంద్ర ప్రభుత్వం మరో మహా క్రతువుకు ఉపక్రమించింది. ఇప్పటికే దేశంలో రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. మొదట దేశంలో వైద్యులు, సిబ్బందికి టీకాలను ఉచితంగా కేంద్రం అందించింది. ఇప్పుడు మరోసారి ఉచితంగా టీకా పంపిణీకి సిద్ధమైంది.

తాజాగా కేంద్ర కేబినెట్ బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.

ధీర్ఘకాలిక వ్యాధులు కలిగిన 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.

దేశంలో మొత్తం 10వేల ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ చేపడుతామని వెల్లడించారు. మరో 20వేల ప్రైటే కేంద్రాల ద్వారా కూడా టీకా పంపిణీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రైవేటు కేంద్రాల్లో పంపిణీ చేసే వ్యాక్సిన్ల ధరలను కొద్దిరోజుల్లో నిర్ణయించనున్నట్లు తెలిపారు. రెండో దశలో 27కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.

జనవరి 16న ప్రారంభమైన ఈ టీకా పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉదయం నాటికి 1.21 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సిన్ పంపిణీలో దేశంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.