https://oktelugu.com/

CM Jagan: ఢిల్లీ టూ ఏపీ చక్కర్లేనా?.. జగన్ పర్యటనపై అనుమానాలు?

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చుట్టు గిరగిరా తిరుగుతున్నారు. ఏపీ ప్రయోజనాలు కాపాడాలని ప్రధానమంత్రి మోడీని కలిసిన ప్రతిసారి విన్నవిస్తున్నారు. ఆయన కూడా వింటున్నారు. అలా వదిలేస్తున్నారు. ఫలితంగా రాష్ర్ట కోరికలు తీరేలా కనిపించడం లేదు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అదే పనిగా ఢిల్లీ వెళ్తున్నారు వస్తున్నారు తప్ప ఏ పిసరంత కూడా ఉపయోగం కానరావడం లేదు. దీంతో ప్రజల్లో నైరాశ్యం నెలకొంది. రాష్ర్ట ప్రభుత్వం మాత్రం మోడీతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 4, 2022 / 04:28 PM IST
    Follow us on

    CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చుట్టు గిరగిరా తిరుగుతున్నారు. ఏపీ ప్రయోజనాలు కాపాడాలని ప్రధానమంత్రి మోడీని కలిసిన ప్రతిసారి విన్నవిస్తున్నారు. ఆయన కూడా వింటున్నారు. అలా వదిలేస్తున్నారు. ఫలితంగా రాష్ర్ట కోరికలు తీరేలా కనిపించడం లేదు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అదే పనిగా ఢిల్లీ వెళ్తున్నారు వస్తున్నారు తప్ప ఏ పిసరంత కూడా ఉపయోగం కానరావడం లేదు. దీంతో ప్రజల్లో నైరాశ్యం నెలకొంది. రాష్ర్ట ప్రభుత్వం మాత్రం మోడీతో ఏ పని చేయించుకోలేకపోతోందనే విమర్శలు మాత్రం మూటగట్టుకుంటోంది.

    CM Jagan

    పోలవరం అంచనా వ్యయం పెంచాలని పలుమార్లు కేంద్రాన్ని కోరుతున్నా నెరవేరడం లేదు. విభజన హామీలు తీర్చాలని వేడుకుంటున్నా ఉలుకు పలుకు లేదు. ఎందుకంటే జగన్ తో ఇప్పుడు ప్రధానికి పనిలేదు. అందుకే ఆయన ఎన్ని విన్నతులు చేసినా అవి బుట్టదాఖలే అవుతున్నాయి. కానీ ఆచరణకు నోచుకోవడం లేదు.

    Also Read: విశాఖ‌ప‌ట్నం తీరంలో రింగు వ‌ల వివాదం.. రెండు గ్రామాల మ‌ధ్య ఫైట్‌

    కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను తుంగలో తొక్కేస్తోంది. ఏపీతో రాజకీయంగా అవసరం ఉంటే తప్ప కోరికలు తీరేలా లేవు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి తప్ప సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో రావడం పోవడమే కానీ ఏ పని కూడా కావడం లేదు. ఎన్డీయే బలం బాగానే ఉండటంతో ఇతర పార్టీల అవసరం లేకుండా పోతోందని తెలుస్తోంది.

    ఈ నేపథ్యంలో ఏపీలో మహామహులున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు ఏపీ నేత అయినా రాష్ర్ట ప్రయోజనాల కోసం ఏనాడు పోరాటం చేసిన సందర్భాలు లేవు. దీంతో జగన్ ప్రయత్నం అంతా వృథాగానే పోతోందనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఢిల్లీ టూ ఏపీ చక్కర్లు కొట్టడంతోనే సమయం కాస్త హరించుకుపోతోందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఏపీ ప్రయోజనాలు కాపాడుతోందా అని అందరిలో అనుమానాలు వస్తున్నాయి.

    Also Read: ఏపీ ప్రభుత్వం అలా చేసి చూపించాలంటూ ఛాలెంజ్ చేస్తున్న ఆర్జీవి… దాని గురించేనా ?

    Tags