https://oktelugu.com/

Bigg Boss Sunny: 100 కోట్ల ఆఫర్ ను వద్దన్న బిగ్ బాస్ విన్నర్ సన్నీ… రీజన్ ఏంటంటే ?

Bigg Boss Sunny: బిగ్ బాస్ సీజన్ 5 ఆద్యంతం ప్రేక్షకులను అలరించి ముగిసింది. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం సీజన్ 5 విన్నర్ సన్నీకి క్రేజ్ మామూలుగా లేదని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో ఉన్న తెలుగువారి నుంచి కూడా నిత్యం సన్నీకి ఫోన్లు మెసేజ్ లు వస్తూనే ఉన్నాయట. వరుస ఇంటర్వ్యూ లతో బిజీ బిజీగా మారాడు సన్నీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీ తనకు ఎదురైన ఓ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 4, 2022 / 04:20 PM IST
    Follow us on

    Bigg Boss Sunny: బిగ్ బాస్ సీజన్ 5 ఆద్యంతం ప్రేక్షకులను అలరించి ముగిసింది. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం సీజన్ 5 విన్నర్ సన్నీకి క్రేజ్ మామూలుగా లేదని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో ఉన్న తెలుగువారి నుంచి కూడా నిత్యం సన్నీకి ఫోన్లు మెసేజ్ లు వస్తూనే ఉన్నాయట. వరుస ఇంటర్వ్యూ లతో బిజీ బిజీగా మారాడు సన్నీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీ తనకు ఎదురైన ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినందుకు రోజూ వందలాది కాల్స్ వస్తుండగా ఇటీవల అమెరికా నుంచి ఉష అనే మహిళా అభిమాని సన్నీకి వీడియో కాల్ చేశారట.

    సన్నీ ఆమెతో మాట్లాడుతుండగా… ఆమె నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగారట. అయితే గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరని ఆయన బదులివ్వడంతో సదరు మహిళ సన్నీకి ఊహించని ఆఫర్ ఇచ్చిందని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. తమ కూతురిని వివాహమాడమని కోరిన ఆ ఉష అనే మహిళ… తనకు రూ. 100 కోట్ల ఆస్తికి పైగా ఉన్నట్లు చెప్పిందట. మరికొద్ది రోజుల్లో మా అమ్మాయి నిన్ను కలవడానికి ఇండియాకు వస్తుందంటూ నీవు ఇంకెవరిని చూడవద్దని కోరిందట. అయినా మా అమ్మాయిని చూస్తే నువ్వే రివర్స్ కట్నం ఇస్తానంటావు, ఒక్కసారి చూడు సన్నీ నేను సీరియస్‌గానే అడుగుతున్నాని చెప్పిందట. దీనికి బదులుగా సన్నీ నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలని చెప్పాడట.

    అలానే తన తల్లి ఆస్తి వంటి వాటిని పరిగణనలోకి తీసుకోదని చెబుతూ సున్నితంగా తిరస్కరించానని సన్నీ చెప్పారు. బిగ్ బాస్ షో అనంతరం విన్నర్ కు ఓ నాలుగైదు షో లు ఒకటి అరా సినిమా అవకాశాలు తప్పితే ఇప్పటివరకు ఎవరికీ పెద్దగా ఒరిగింది ఏమి లేదు. అయితే ఈసారి సన్నీ కి మాత్రం షో లతో పాటు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి అంటే అతని స్థాయి ఏ రేంజ్‌లో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఏకంగా రూ.100 కోట్ల అమెరికా సంబంధమే వచ్చిందంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.