https://oktelugu.com/

Unstoppable Show: బాలయ్య అన్ స్టాపబుల్ షో కి రానున్న ఆ హీరో… ఎవరో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా!

Unstoppable Show: ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్​గా ప్రేక్షకులను అలరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవల అఖండ సినిమాతో ఘన విజయం సాదించాడు బాలయ్య. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్​స్టాపబుల్​ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో ఒకటిగా ‘అన్‌స్టాపబుల్’ నిలిచింది. తనదైన శైలిలో హోస్ట్ గా బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఈ షో కు ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు, నాని, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 4, 2022 / 04:31 PM IST
    Follow us on

    Unstoppable Show: ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్​గా ప్రేక్షకులను అలరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవల అఖండ సినిమాతో ఘన విజయం సాదించాడు బాలయ్య. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్​స్టాపబుల్​ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో ఒకటిగా ‘అన్‌స్టాపబుల్’ నిలిచింది. తనదైన శైలిలో హోస్ట్ గా బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఈ షో కు ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్​ రావిపూడి, అఖండ టీమ్​, రాజమౌళి, కీరవాణి, పుష్ప మూవీ టీమ్ గెస్ట్ లుగా హాజరయ్యారు. రవితేజ, మహేష్ బాబు కూడా పాల్గొన్న ఎపిసోడ్ లను త్వరలోనే ప్రసారం చేయనున్నారు.

    “అన్‌స్టాపబుల్” షో ఆశ్చర్యకరంగా రాజమౌళి, రవితేజ, అల్లు అర్జున్ వంటి ఊహించని అతిథులను తెరపైకి తీసుకు వస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది ఆహా టీమ్. మొద‌టి రెండు ఎపిసోడ్ల త‌ర్వాత బాల‌య్య చేతికి ఆప‌రేష‌న్ కార‌ణంగా కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత బాల‌య్య రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో పాటు పెద్ద పెద్ద స్టార్ల‌ను షోకు తీసుకు వ‌స్తున్నాడు. అస‌లు ర‌వితేజ లాంటి ఎవ్వ‌రూ ఊహించ‌ని హీరోను కూడా షోలోకి తీసుకు రావ‌డం… ఇబ్బంది లేకుండానే ఇరుకున పెట్టే ప్ర‌శ్న‌లు వేస్తూ ఉండ‌డం వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

    ఇక ఇప్ప‌టికే మ‌హేష్‌బాబుతో బాల‌య్య చేసిన షో కూడా షూటింగ్ పూర్త‌య్యింది. అయితే స‌రైన టైం కోస‌మే దీనిని స్ట్రీమింగ్ చేయ‌లేద‌ని అంటున్నారు. సంక్రాంతి కానుక‌గా దీనిని స్ట్రీమింగ్ చేస్తార‌ని టాక్. ఇక ఈ వారంలో రానా రాబోతున్నాడు. ఇక ఇప్పుడు ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోలో విజ‌య్‌ దేవ‌ర‌కొండ – పూరి జ‌గ‌న్నాథ్ పాల్గొన‌బోతున్నారు అని సమాచారం. ఇది కూడా సంక్రాంతికే స్ట్రీమింగ్ అవ్వొచ్చ‌ని తెలుస్తోంది. సంక్రాంతికే రానా, మ‌హేష్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఎపిసోడ‌ర్లు మూడు రోజుల పాటు వ‌రుస‌గా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయంటున్నారు.