లారెన్స్ గ్రేట్ నెస్ కి అందరూ ఫిదా..

తమిళ నటుడు ,దర్శకుడు , డాన్స్ మాస్టర్ అయిన రాఘవ లారెన్స్ మరోసారి తన జాలిగుండె తో ప్రజల మనసులు దోచు కొన్నాడు. కరోనా విలయానికి తన వంతు సాయంగా Rs 3 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించడం జరిగింది ఇందులో పి . ఎం .కేర్స్ ఫండ్ కి Rs 50 లక్షలు , తమిళనాడు ముఖ్య మంత్రి సహాయ నిధికి Rs 50 లక్షలు , ఫెప్సి యూనియన్ కి Rs 50 లక్షలు […]

Written By: admin, Updated On : April 10, 2020 1:44 pm
Follow us on


తమిళ నటుడు ,దర్శకుడు , డాన్స్ మాస్టర్ అయిన రాఘవ లారెన్స్ మరోసారి తన జాలిగుండె తో ప్రజల మనసులు దోచు కొన్నాడు. కరోనా విలయానికి తన వంతు సాయంగా Rs 3 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించడం జరిగింది ఇందులో పి . ఎం .కేర్స్ ఫండ్ కి Rs 50 లక్షలు , తమిళనాడు ముఖ్య మంత్రి సహాయ నిధికి Rs 50 లక్షలు , ఫెప్సి యూనియన్ కి Rs 50 లక్షలు , డాన్సర్స్ యూనియన్ కి Rs 50 లక్షలు , తన దగ్గర ఉన్న దివ్యాంగులకు Rs 25 లక్షలు ఇస్తున్నా అని ప్రకటించడం జరిగింది. ఇవన్నీ ఒకెత్తు అయితే తాను పుట్టి పెరిగిన ఊరికి కూడా Rs 75 లక్షలు ఇచ్చి ఋణం తీర్చుకోనున్నట్టు తెలిసింది.

కరోనా విపత్తు నేపథ్యంలో దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రకటించిన మూడు కోట్ల విరాళం తమిళ సినీ స్టార్స్ అందరినీ తల దించుకునేలా చేసింది. స్టార్స్.. సూపర్ స్టార్స్ అని పిలిపించు కొనేవారు కూడా కోటికి అటు ఇటుగానే సాయం చేశారు. కాని లారెన్స్ మాత్రం ఏకంగా మూడు కోట్ల విరాళంను ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఒక సామాన్య డాన్సర్ స్థాయి నుండి డైరెక్టర్ స్థాయికి ఎదిగిన లారెన్స్ ఇచ్చిన విరాళం నిజంగా హర్షించదగ్గ విషయం. లారెన్స్ కేవలం ఈ విపత్తు సమయంలోనే కాదు మాములుగా కూడా వందలాది మంది అనాధలను, వికలాంగులను తన ఛారిటీ ద్వారా సాకుతున్నాడు. కోట్ల రూపాయలు సంపాదించే సూపర్ స్టార్స్ విరాళం ఇచ్చేందుకు కిందా మీదా పడుతున్నారు. అలాంటిది లారెన్స్ మూడు కోట్లు ఇవ్వడం నిజంగా గొప్ప విషయమే … అందులో ఎటువంటి సందేహం అక్కరలేదు.