Homeజాతీయ వార్తలుDonald Trump : ట్రంప్ బృందంలో భారతీయుల ఆధిపత్యం.. వైట్ హౌస్ లోకి మరో ఇండియన్.....

Donald Trump : ట్రంప్ బృందంలో భారతీయుల ఆధిపత్యం.. వైట్ హౌస్ లోకి మరో ఇండియన్.. ఆయన ఎవరంటే ?

Donald Trump : అగ్రరాజ్య అధ్యక్షుడిగా (47) రెండవసారి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజున, ట్రంప్ పెద్ద సంఖ్యలో అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో ముఖ్యంగా జన్మత: అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేయడం, ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు. వాటిలో ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లును యుఎస్ కాంగ్రెస్ ఆమోదించింది. అక్రమ వలసదారులపై చర్య తీసుకోవడానికి ఇది మార్గం సుగమం చేసినట్లు కనిపిస్తోంది. అయితే, పుట్టుక ద్వారా అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసే కార్యనిర్వాహక ఉత్తర్వు అమలులోకి రాకముందే యుఎస్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతానికి ఎటువంటి సమస్య లేనప్పటికీ.. ఈ ఉత్తర్వును ఎలాగైనా అమలు చేయాలని ట్రంప్ నిశ్చయించుకున్నారు.

ఇది ఇలా ఉంటే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన అనేక మందిపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ట్రంప్ తన బృందంలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తిని చేర్చుకున్నారు. అమెరికా అధ్యక్షుడు తన డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారతీయ-అమెరికన్ మాజీ జర్నలిస్ట్ కుష్ దేశాయ్‌ను నియమించారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రకటించింది. కుష్ దేశాయ్ గతంలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా, అయోవా రిపబ్లికన్ పార్టీకి కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. అతను రిపబ్లికన్ నేషనల్ కమిటీలో డిప్యూటీ బాటిల్‌గ్రౌండ్ స్టేట్స్, పెన్సిల్వేనియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు.

ఈ పదవిలో కీలకమైన యుద్ధభూమి రాష్ట్రాల(battleground states)లో ముఖ్యంగా పెన్సిల్వేనియాలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. ట్రంప్ ఏడు బాటిల్ గ్రౌండ్ స్టేట్స్ గెలుచుకున్నాడు. అంతకుముందు ట్రంప్ తన కార్యదర్శిగా, వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా స్టీవెన్ చియుంగ్‌ను నియమించారు. ఇది కాకుండా కరోలిన్ లెవిట్ కార్యదర్శి , ప్రెస్ సెక్రటరీగా నియమితులయ్యారు. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ ఆఫీస్‌ను వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, క్యాబినెట్ సెక్రటరీ టేలర్ బుడోవిచ్ పర్యవేక్షిస్తారు.

ట్రంప్ మంత్రివర్గంలో భారత సంతతి వ్యక్తులు
* కాష్ పటేల్- ట్రంప్ భారత సంతతికి చెందిన కాష్ పటేల్‌ను అమెరికా కొత్త FBI చీఫ్‌గా నియమించారు.
* వివేక్ రామస్వామి- ట్రంప్ కొత్త ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE) కోసం వివేక్ రామస్వామిని ఎంపిక చేశారు. ప్రభుత్వానికి సలహా ఇవ్వడం రామస్వామి పని.
* జై భట్టాచార్య- ట్రంప్ జై భట్టాచార్యను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) డైరెక్టర్‌గా నియమించారు.
* తులసి గబ్బర్డ్- ట్రంప్ తులసి గబ్బర్డ్‌ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు. ఆమె ఇటీవలే డెమోక్రటిక్ పార్టీని వీడి రిపబ్లికన్ పార్టీలో చేరారు.
* హర్మీత్ కె ధిల్లాన్ – ట్రంప్ ధిల్లాన్‌ను న్యాయ శాఖలో పౌర హక్కుల అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా నామినేట్ చేశారు.

ట్రంప్ అమెరికా సంయుక్త రాష్ట్రాల 47వ అధ్యక్షుడు
జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఇది ఆయన రెండో పదవీకాలం. ఆయన 2016-20 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular