Donald Trump: భారత్ ఎదుగుతున్న తీరును తట్టుకోలేక పాకిస్తాన్ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది. అందువల్లే ఉగ్రదాడులకు పాల్పడుతోంది. ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న పాకిస్తాన్ ప్రతి సందర్భంలోనూ భారత్ పై విద్వేషాన్ని రగల్చడమే పనిగా పెట్టుకుంది. గతంలో మన దేశంలో రాజకీయ లుకలుకలను తనకు అనువుగా మలుచుకుని.. ఉగ్రదాడులకు పాల్పడేది. ఒకప్పటిలాగా కాకున్నా.. ఇప్పుడు కూడా ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్ ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇలాంటి దాడుల వల్ల అంతర్జాతీయంగా భారత్ పరువు తీయడానికి పాకిస్తాన్ పన్నాగాలు పన్నుతోంది. ఇక ఇటీవల కాలంలో పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేయడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భారత్ ను మాత్రమే కాదు.. ప్రపంచాన్ని సైతం నివ్వెర పరిచింది.. ఈ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ పని పట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే సీక్రెట్ వర్క్ మొదలుపెట్టింది.
Also Read: ఆర్మీకి పూర్తిస్థాయిలో స్వేచ్ఛ.. నేడు స్వయంగా వీక్షణ: ఆపరేషన్ సింధూర్ లో మోడీ మార్క్!
ఎవరికి మద్దతు
ప్రస్తుతం ప్రపంచ పెద్దన్నగా అమెరికా ఉంది. భారత్ ఆల్రడీ పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. మరి ఈ స్టేజిలో అమెరికా ఎవరికి మద్దతు ఇస్తుంది? పాకిస్తాన్ వైపు ఉంటుందా? భారత్ కు సపోర్ట్ చేస్తుందా? ఈ ప్రశ్నలకు స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమాధానం చెప్పారు. ఆయన మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.. ఆ వీడియో ప్రకారం.. “యుద్ధం అంటూ వస్తే భారతదేశానికే నా మద్దతు ఉంటుంది. ఐ లవ్ ఇండియా. భారత్ తో అమెరికాకు మంచి సంబంధం ఉంది. దాన్ని కొనసాగిస్తూనే ఉంటాం.. ఇక పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని తుడిచి వేయాలి. అవసరమైతే దానిని ఎరేజ్ చేయాలి. చైనా ఆధిపత్యాన్ని పూర్తిగా తగ్గించాలి. దీనికోసం మా సపోర్ట్ భారత్ కు ఉంటుందని” ట్రంప్ వ్యాఖ్యానించాడు. అయితే ఇవి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కావాలి.. అదంతా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన వీడియో అని నెటిజన్లు అంటున్నారు..” అమెరికా యుద్ధాన్ని ఎప్పుడూ ఆపదు. దాని స్వార్థకాంక్ష కోసమే అమెరికా పనిచేస్తూ ఉంటుంది. ప్రపంచ శాంతి కోసం ఆ దేశం ఎప్పుడూ పాటుపడదు. యుద్ధం వస్తే చలికాచుకునే రకం అమెరికాది అంటూ” నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికా వల్ల ఇబ్బంది పడిన అనేక దేశాలకు సంబంధించిన ఉదాహరణలను వారు ఉదహరిస్తున్నారు.” అమెరికా తన ప్రయోజనాల కోసం గతంలో పాకిస్తాన్ దేశాన్ని వాడుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్ వల్ల ఎంత నష్టం జరిగిందో ఆదేశం ప్రత్యక్షంగా చూసింది. ఆ తర్వాత బిన్ లాడెన్ పై యుద్ధం ప్రకటించింది. చివరికి అతడిని పాకిస్తాన్లోనే పట్టుకుంది. అత్యంత రహస్యంగా మట్టి పెట్టిందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Breaking News #Trump I support India And Erase Pakistan.
#IndiaPakistanWar #PakistanArmy #IndianArmy pic.twitter.com/UHfoCHarli— HITMAN ️ (@CaptianHitman) May 1, 2025