Operation Sindoor: ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు పర్యాటకులను కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో నాటి నుంచి ఉగ్రవాదులను లక్ష్యంగా పెట్టుకున్న భారత్.. కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఉందని గ్రహించిన భారత నిఘవర్గాలు.. కేంద్రానికి సమాచారం అందించాయి. ఇక అప్పటినుంచి పని మొదలు పెట్టింది భారత్. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్.. త్రివిధ దళాధిపతులు పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించారు. వాటిని అత్యంత జాగ్రత్తగా నేలమట్టం చేయడానికి స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేకసార్లు త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. అజిత్ దోవల్ తో సమావేశమయ్యారు. ఇందులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా భాగస్వాములయ్యారు. మొత్తంగా బ్లూ ప్రింట్ రెడీ కావడంతో.. మంగళవారం అర్ధరాత్రి నుంచి భారత సైన్యం తన పని మొదలుపెట్టింది. ఇదే విషయాన్ని ప్రపంచ దేశాలకు వివరించి.. దౌత్యపరంగా తనకు ఇబ్బందులు లేకుండా చూసుకుంది. అంతేకాదు పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై నిప్పుల వర్షం కురిపించింది. భారత సైన్యం చేసిన దాడులలో ఉగ్రవాదుల స్థావరాలు నేలమట్టమయ్యాయి.
Also Read: ఉగ్రవాదులపై దాడి కి ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరు ఎందుకు పెట్టారు?
నరేంద్ర మోడీ స్వీయ పర్యవేక్షణ
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైన్యం చేస్తున్న శత్రుసంహారాన్ని నరేంద్ర మోడీ స్వయంగా పర్యవేక్షించారు. ఆయన వెంట జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే తాము నేలమట్టం చేస్తున్నామని.. పాక్ పౌరులకు తాము ఏమాత్రం హాని కలిగించడం లేదని అమెరికాకు ఇండియన్ నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్ వివరించారు.. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని.. వాటిని మాత్రమే తాము టార్గెట్ చేశామని ఇండియన్ నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్ అమెరికాకు ఎక్స్ ప్లెయిన్ చేశారు.. ఈ క్రమంలో అమెరికా కూడా భారత్ వెల్లడించిన వివరాలపై సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు భారత చేస్తున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. త్వరలో రెండు దేశాల మధ్య సయోధ్య పురకమైన వాతావరణం నెలకొంటుందని వ్యాఖ్యానించారు. బుధవారం ప్రధాని ఆధ్వర్యంలో సిసిఎస్ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్మీకి పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. ఏం చేస్తారో చేయండి.. పాకిస్తాన్ జన్మలో భారత్ వైపు చూడొద్దు అని సంకేతాలు ఇచ్చారు.. దానికి తగ్గట్టుగానే భారత ఆర్మీ పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదులకు చుక్కలు చూపించడం ప్రారంభించింది.. ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది.