Homeజాతీయ వార్తలుDonald Trump : ఇరాన్‌ అణు భయం.. అమెరికాతో చర్చలకు ససేమిరా!

Donald Trump : ఇరాన్‌ అణు భయం.. అమెరికాతో చర్చలకు ససేమిరా!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా వెన్నులు వణుకు పుట్టిస్తోంది ఇస్లాం దేశం ఇరాన్‌. అణు బాంబులతో భయపెడుతోంది. ఇదే సమయంలో అమెరికా(America) ఇరాన్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అణు కార్యక్రమాలపై చర్చలు జరపాలని, ఒప్పందం చేసుకోవాలని హెచ్చరిస్తోంది. లేదంటే బాంబు దాడులకు కూడా వెనుకాడమని స్పష్టం చేశారు అగ్రరాజ్యాధినేత ట్రంప్‌(Trump). అయినా తన అణు కార్యక్రమంపై అమెరికాతో నేరుగా చర్చలు జరపడం సాధ్యం కాదని ఇరాన్‌ స్పష్టం చేసింది.

Also Read : ఏప్రిల్‌ 2న ఏం జరుగుతుంది.. ట్రంప్‌ అన్నంత పని చేస్తాడా?

అధికారికంగా స్పందన..
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ సుప్రీం నేత ఖొమైనీ(Khaimaini)కి రాసిన లేఖకు ఇరాన్‌ అధికారికంగా స్పందించింది. ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్, అమెరికాతో చర్చల నుంచి తప్పించుకోవడం లేదని, అయితే నేరుగా చర్చలకు బదులు పరోక్ష చర్చలే సాధ్యమని తెలిపారు. ట్రంప్‌ బాంబు దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్‌ క్షిపణి ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పెజెష్కియాన్‌ మాట్లాడుతూ, ‘అమెరికా ఎన్నో వాగ్దానాలను ఉల్లంఘించింది. ఈ విషయంలోనే మాకు అభ్యంతరాలున్నాయి. ముందుగా ఆ దేశం మాకు విశ్వాసం కలిగించాలి‘ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందిస్తూ, ‘ట్రంప్‌ చర్చలకు దారి తెరిచారు. ఒప్పుకోకపోతే ఇరాన్‌ అణు కార్యక్రమంపై సైనిక చర్య తప్పదు‘ అని హెచ్చరించింది.

ట్రంప్‌ హెచ్చరిక..
మరోవైపు, ట్రంప్‌ ఇరాన్‌ను గట్టిగా హెచ్చరించారు. అణు ఒప్పందం కుదరకపోతే బాంబు దాడులు తప్పవని, ఇరాన్‌ ఊహించని రీతిలో దాడులు జరుగుతాయని, అదనంగా కఠిన ఆంక్షలు విధిస్తామని పేర్కొన్నారు. ట్రంప్‌ మొదటి హయాంలోనూ ఇరాన్‌తో సంబంధాలు ఒడిదొడుకులతో సాగాయి. 2018లో అమెరికా అణు ఒప్పందం నుంచి వైదొలగి, ఇరాన్‌పై ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి పరోక్ష చర్చలు విఫలమవుతున్నాయి. ఇటీవల ట్రంప్‌ మరోసారి ఒప్పందం కోసం సంసిద్ధత వ్యక్తం చేశారు. ‘ఇరాన్‌తో ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తా. ఆ దేశాన్ని దెబ్బతీయాలని అనుకోవడం లేదు. చర్చలకు వస్తారని ఆశిస్తున్నా. అది వారికే లాభదాయకం‘ అని అన్నారు. అయితే, ఇరాన్‌ వైఖరి, అమెరికా హెచ్చరికలతో ఉద్రిక్తత కొనసాగుతోంది.

Also Read : ట్రంప్ టారిఫ్ దెబ్బ బజాజ్, మహీంద్రా, రాయల్ ఎన్‎ఫీల్డ్‎లకు ఎందుకు ఉండదు ?

RELATED ARTICLES

Most Popular