Modi Friendship: మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. కొందరు పదవీచ్యుతులవుతున్నారు. దీంతో దీనికి కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీననే వాదనలు కూడా వస్తున్నాయి. మోచేతిలో బలముంటే మొండి కొడవలయినా తెగుతుంది అంటారు. అంతే కాని ఎవరో చేస్తే దుష్ఫలితాలు వస్తాయా? అలాగైతే అందరు నాశనం కావాల్సిందే. మోడీతో స్నేహం చేసిన వారందరు కూడా తమ పదవులు కోల్పోతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మోడీని ఐరన్ లెగ్ గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు తన పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ రసగుల్లాతో పాటు ప్రత్యేక వంటకాలు పంపించారు. తరువాత కొంత కాలానికి ఆయన ప్రధానమంత్రి పదవి కోల్పోయారు. ఇక అమెరికా అధ్యక్షుడుగా గతంలో ఉన్న డొనాల్డ్ ట్రంపుకు మోడీకి ఉన్న స్నేహం తెలిసిందే. దీంతో ట్రంపు విజయం కోసం ఏడు రోజులు మోడీ అమెరికాలో ఉండి తెలుగువారందరు ట్రంపుకే ఓటు వేయాలని కోరారు. కానీ ట్రంపు ఘోర పరాజయం పాలయ్యారు.
Also Read: PM Modi- Chiranjeevi: మెగాస్టార్ కు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్.. చిరంజీవి ఎందుకు తిరస్కరించారంటే?
ఇదే సందర్భంలో ఇటీవల ఇంగ్లండ్ లో పదవీచ్యుతుడైన ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కూడా మోడీతో మంచి స్నేహితుడుగా ఉంటారు. దీంతో వివిధ కారణాలతో జాన్సన్ పదవి కోల్పోవడం గమనార్హం. జాన్సన్ అంటే మోడీకి ఎంతో ఇష్టం. ఒకసారి జాన్సన్ ను ఇండియాకు పిలిపించుకుని మరీ ప్రశంసించాడు. కానీ కొద్ది కాలానికే ఆయన పదవి కోల్పోవడం సంచలనం కలిగించింది. అంతర్గత కుమ్ములాటల కారణంగా బోరిస్ జాన్సన్ తన పదవి వదులుకోవాల్సి వచ్చింది.

దీంతో మోడీ స్నేహంపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మోడీతో ఉన్న పరిచయాల కారణంగానే వారు పదవులు కోల్పోయారని చెబుతున్నారు. మన ప్రధానమంత్రి మోడీ కారణంగానే వారి పదవులకు దూరం అయ్యారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎవరి తలరాతలు ఎవరు మారుస్తారు? విధి వైపరీత్యంతోనే ఇలా జరుగుతుందని తెలిసినా మోడీని మాత్రం పావుగా వాడుకుంటున్నారు. మోడీతో ఉన్న స్నేహం కారణంగానే వారు పదవులకు దూరమయ్యారనే సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆడలేక మద్దెల ఓడు అన్న సామెత లాగా వారు సహజంగా పదవులకు దూరమైతే మోడీని ఎందుకు నిలదీస్తున్నారో అర్థం కావడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Also Read:Revanth Reddy: రేవంత్ మరో రాజశేఖర్ రెడ్డి అవుతారా?
[…] […]