BC calculation: కుల గణన చేపట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఎప్పుడో చేపట్టిన లెక్కలతోనే ఇప్పటికి కూడా అంచనాలు వేయడంతో తేడాలు వస్తున్నాయనేది పలువురి వాదన. రిజర్వేషన్లతో పాటు పలు సంక్షేమ పథకాల్లో తమకు అన్యాయం జరుగుతుందని కుల సంఘాల అభిప్రాయం. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లు బీసీ కుల గణన చేపట్టాలని తీర్మానం చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీనికి కేంద్రం ఏం చెబుతుందనేదానిపై అందరికి ఆసక్తి ఏర్పడింది.

అయితే బీసీ కుల గణన చేపడితే మిగతా వారికి మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు. దీనికి కేంద్రం మాత్రం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. బీసీ గణన చేపడితే వారికి రిజర్వేషన్ల శాతం పెంచాల్సి వస్తుందని కేంద్రం వాదన. ఈ నేపథ్యంలో బీసీ గణనకు కేంద్రం మోకాలడ్డుతోందని తెలుస్తోంది. దీంతో రాష్ర్ట ప్రభుత్వాల డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. దీంతోనే తెలుగు స్టేట్లలో కూడా ఆందోళన నెలకొంది.
మరోవైపు బీసీ కుల గణన చేపడితే మిగతా కులాల నుంచి కూడా అదే వాదన వస్తుందని భావించి కేంద్రం వెనకడుగు వేస్తుందని తెలుస్తోంది. బీసీ కుల గణన చేపడితే కలిగే ప్రమాదంపై బీజేపీ అప్పుడే ఓ అంచనాకు రావడంతో దానికి ససేమిరా అంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి రెండు స్టేట్ల వినతులను సైతం పక్కన పెట్టే వరకు వెళ్లడం గమనార్హం. తెలుగు స్టేట్లు ప్రధాని మోడీపై యుద్ధం చేస్తారా? లేక ఆయన ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే అని అనుకుంటారా అని అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీసీలను తమ వైపు తిప్పుకునే క్రమంలో పార్టీలు తలమునకలైపోయాయి. దీంతో స్టేట్లలో బీసీ గణన చేపట్టి వారి సంఖ్య ఆధారంగా వారికి సంక్షేమ పథకాలు అందజేయాలని భావిస్తోంది. ఇందుకుగాను బీసీ గణన చేసి ప్రజల కోరిక నెరవేర్చాలని ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వాల ఆశను నెరవేర్చేందుకు కేంద్ర మాత్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. బీసీ గణన చేపడితేనే మనుగడ బాగుంటుందని ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.