https://oktelugu.com/

ఉప ఎన్నికలపై పవన్ భవితవ్యం ఆధారపడి ఉందా?

అమరావతి రాజధాని అంశం ఏపీలో ఉప ఎన్నికలకు దారితీసేలా కన్పిస్తున్నాయి. మూడు రాజధానుల నిర్ణయానికి సీఎం జగన్ కట్టుబడి ముందుకెళుతుండగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని(అమరావతి) అంటూ చంద్రబాబు పోరాడుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ ఏపీలో చేపట్టిన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరుకుంది. చంద్రబాబు నాయుడితోసహా టీడీపీ ఎమ్మెల్సేలంతా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి రాజధాని అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 5, 2020 / 01:05 PM IST
    Follow us on


    అమరావతి రాజధాని అంశం ఏపీలో ఉప ఎన్నికలకు దారితీసేలా కన్పిస్తున్నాయి. మూడు రాజధానుల నిర్ణయానికి సీఎం జగన్ కట్టుబడి ముందుకెళుతుండగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని(అమరావతి) అంటూ చంద్రబాబు పోరాడుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ ఏపీలో చేపట్టిన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరుకుంది. చంద్రబాబు నాయుడితోసహా టీడీపీ ఎమ్మెల్సేలంతా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి రాజధాని అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాంమంటూ చంద్రబాబు సీఎం జగన్ కు సవాల్ విసురుతున్నారు.

    Also Read: ఏపీ రాజకీయం.. బీజేపీ వెయిట్ అండ్ సీ పాలసీ?

    చంద్రబాబు సవాలుకు జగన్ స్పందిస్తారా? లేదా అన్నది పక్కకు పెడితే.. ఈ విషయంలో బాబు తన చిత్తశుద్ధి చాటుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. టీడీపీకి చెందిన 23మంది ఎమ్మెల్సేలతో బాబు రాజీనామా చేయిస్తే తప్పనిసరిగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీకి చెక్ పెట్టేందుకు శతవిధలా ప్రయత్నించడం ఖాయం కన్పిస్తోంది. అయితే ఈ ఉప ఎన్నికలు జనసేన పార్టీకి కత్తిమీద సాములా మారనున్నాయి. జనసేన-బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. దీంతో పవన్ కల్యాణ్ ఏదో ఒక చోటు నుంచి తప్పనిసరిగా పోటీ చేయాల్సి ఉంటుంది.

    ఉప ఎన్నికల ఫలితాలు జనసేన-బీజేపీ కూటమి భవిష్యత్ ను నిర్ణయించనున్నాయి. ఈ ఎన్నికల్లో పవన్ పోటీచేసి సత్తా చాటితే రానున్న రోజుల్లో ఏపీలో జనసేనకు తిరుగుండదనే వాదనలు విన్పిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీలో జనసేనకు మరింత బలం చేకూరనుంది. మరోవైపు 2024ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిపై మరింత క్లారిటీ రానుంది. ఉప ఎన్నికల్లో పవన్ గెలిస్తే ఖచ్చితంగా బీజేపీ పవన్ కల్యాణ్ ను బీజేపీ-జనసేన కూటమికి సీఎం అభ్యర్థిగా ప్రకటించి ముందుకెళ్లడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి.

    Also Read: తుస్సుమన్న మాతృభాష మాధ్యమ బోధన విధానం

    ఒకవేళ పవన్ ఓడిపోతే ఏంటనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. ఉప ఎన్నికల్లో పవన్ ఓటమి చెందితే 2024 ఎన్నికల్లో బీజేపీకి చెందిన వ్యక్తే సీఎం అభ్యర్థి అవుతారని ప్రచారం జరుగుతోంది. త్వరలో జరిగే ఉప ఎన్నికలు బీజేపీ-జనసేన కూటమి భవిష్యత్ నిర్ణయించేలా కన్పిస్తున్నాయి. ఇక ఏపీలో ఎన్నికలు జరిగి ఏడాదే అవుతుండటంతో పవన్ కల్యాణ్ కు ఉప ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సంవత్సర కాలంలో పవన్ పెద్దగా ప్రజా మద్దతు కూడగట్టుకున్నది కూడా ఏం లేదని.. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటమే బెటరని కొందరు పవన్ అభిమానులు సూచిస్తున్నారట.

    దీంతో జనసేనాని ఉప ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళుతారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే పవన్ సినిమాల్లో కొనసాగాలా? లేదా రాజకీయాల్లో కొనసాగాలా అనేది కూడా ఈ ఉప ఎన్నికలే తేల్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో ఉప ఎన్నికలు పవన్ సత్తాకు పరీక్ష పెట్టేలా కన్పిస్తున్నాయి. మరీ పవన్ సత్తా చాటుతారా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!