https://oktelugu.com/

ఉద్యమం బాబుదైతే, త్యాగం మాత్రం జగన్ చేయాలట..!

చంద్రబాబు పసలేని సవాల్ చూసి ఆంధ్ర ప్రజలు మరియు రాజకీయ విశ్లేషకులు నవ్వుకుంటున్నారు. విషయం లేని ఈ సవాల్ వల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటని చర్చించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వానికి బాబు అమరావతి విషయమై ఓ సవాల్ విసిరారు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు దిగి మరలా గెలవాలట. అలా కనుక వారు మరలా విజయం సాధిస్తే మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజామద్దతు ఉందని, అమరావతి అంశాన్ని వదిలివేస్తాం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 5, 2020 / 01:18 PM IST
    Follow us on


    చంద్రబాబు పసలేని సవాల్ చూసి ఆంధ్ర ప్రజలు మరియు రాజకీయ విశ్లేషకులు నవ్వుకుంటున్నారు. విషయం లేని ఈ సవాల్ వల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటని చర్చించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వానికి బాబు అమరావతి విషయమై ఓ సవాల్ విసిరారు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు దిగి మరలా గెలవాలట. అలా కనుక వారు మరలా విజయం సాధిస్తే మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజామద్దతు ఉందని, అమరావతి అంశాన్ని వదిలివేస్తాం అన్నారు. ఈ విషయమై వైసీపీకి 48గంటల డెడ్ లైన్ విధించిన చంద్రబాబు తనకు ఏ విషయం చెప్పాలని సవాల్ విసిరారు. బాబు చేసిన ఈ వీర సవాల్ ని టీడీపీ మీడియా ఒక రేంజ్ లో ఎలివేట్ చేస్తుంది. బాబు సవాల్ ని స్వీకరించే దమ్ము వైసీపీ ప్రభుత్వానికి, నేతలకు ఉందా అని ఆవేశ పూరిత కథనాలు వండివార్చుతుంది.

    Also Read: ఉప ఎన్నికలపై పవన్ భవితవ్యం ఆధారపడి ఉందా?

    ఐతే అసలు ఉద్యమం ఎవరిదీ? ఎవరు రాజీనామాలు చేయాలి? అనేది ఇక్కడి ప్రశ్న. అమరావతి ఉద్యమం బాబు మరియు టీడీపీ నేతలది అయినప్పుడు రాజీనామాలు చేయాల్సింది వారు, నిరసన తెలపాల్సింది వారు. అలా కాకుండా వైసీపీ నాయకులు రాజీనామా చేయాలని, అసెంబ్లీ రద్దు చేయాలని కోరడం, బాబు పసలేని పోరాటానికి తార్కాణం. తెలంగాణా ఉద్యమం కోసం కెసిఆర్ మరియు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలుమార్లు రాజీనామా చేసి, మరలా గెలిచి ప్రజామద్దతు తమకు ఉందని నిరూపించుకున్నారు. అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని బాబు చెబుతున్న పక్షంలో ఆయన పార్టీ తరుపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు అన్నీ ప్రాంతలకు చెందినవారు ఉన్నారు. కాబట్టి బాబు రాజీనామా చేసి 23 నియోజకవర్గాలలో గెలిచిన పక్షంలో జగన్ తెచ్చిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ప్రజామద్దతు లేదని తేలిపోతుంది. అప్పుడు బాబు కోరుకున్నట్లు జగన్ అమరావతినే రాజధానిగా కొనసాగించే అవకాశం ఉంటుంది.

    Also Read: ఏపీ రాజకీయం.. బీజేపీ వెయిట్ అండ్ సీ పాలసీ?

    ఉద్యమం నీదైనప్పడు త్యాగం కూడా నీదేకావాలి. స్వాతంత్య్ర పోరాటకాలం నుండి ఉద్యమాలు చేసేవారు త్యాగాలు చేసి నిరసన తెలియజేశారు. బాబు మాత్రం ఉద్యమంలో కొత్త నీతి, తనకు అనుకూల సిద్దాంతం తెరపైకి తెచ్చారు. బాబు ఈ విషయంలో ఎంత గొంతు చించుకున్నా, ప్రజలలో కనీస స్పందన రావడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు మొత్తం ఒక ప్రాంత ప్రజలకే కట్టబెడతాను అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి. ఇక జగన్ మ్యానిఫెస్టోలో మూడు రాజధానుల అంశం లేదని టీడీపీ నేతలు విమర్శించడం కూడా హాస్యాస్పదంగా ఉంది. 2014 ఎన్నికలలో బాబు అమరావతిని రాజధానిని చేస్తాను అని చెప్పలేదు కదా. అలాగే నిపుణుల కమిటీ సిపార్సులకు విరుద్ధంగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. బాబు చేసిన అప్పటి తప్పిదాల ఫలితమే నేటి అమరావతి ఉద్యమం.