https://oktelugu.com/

రాజధాని రైతులపై పవన్ కి చిత్తశుద్ధి ఉందా?

కొన్నాళ్లుగా చాతుర్మాస దీక్షలో ఉన్న పవన్ పెద్దగా పొలిటికల్ కామెంట్స్ చేయడం లేదు. దాదాపు ఆయన తన ఫార్మ్ హౌస్ కే పరిమితం అవుతూ, ట్విట్టర్ పోస్ట్స్ మాత్రమే చేస్తున్నారు. ఆంద్రప్రదేశ్ లో కరోనా ఉధృతి, మూడురాజధానుల ఏర్పాటు, సి ఆర్ డి ఏ బిల్లు రద్దు మరియు నిమ్మగడ్డ వ్యవహారం వంటి అనేక విషయాలపై వాడి వేడి చర్చ నడుస్తున్న తరుణంలో పవన్ ఫార్మ్ హౌస్ కే పరిమితం కావడంపై సొంత పార్టీ నేతలలోనే అసహనం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 25, 2020 / 10:33 AM IST
    Follow us on


    కొన్నాళ్లుగా చాతుర్మాస దీక్షలో ఉన్న పవన్ పెద్దగా పొలిటికల్ కామెంట్స్ చేయడం లేదు. దాదాపు ఆయన తన ఫార్మ్ హౌస్ కే పరిమితం అవుతూ, ట్విట్టర్ పోస్ట్స్ మాత్రమే చేస్తున్నారు. ఆంద్రప్రదేశ్ లో కరోనా ఉధృతి, మూడురాజధానుల ఏర్పాటు, సి ఆర్ డి ఏ బిల్లు రద్దు మరియు నిమ్మగడ్డ వ్యవహారం వంటి అనేక విషయాలపై వాడి వేడి చర్చ నడుస్తున్న తరుణంలో పవన్ ఫార్మ్ హౌస్ కే పరిమితం కావడంపై సొంత పార్టీ నేతలలోనే అసహనం మొదలైనట్లుంది. దీనితో పవన్ ఓ ఇంటర్వ్యూ ద్వారా అనేక విషయాలపై స్పందించారు.

    Also Read: జగన్ కు కీలకమైన సూచనలు చేసిన ఏంపీ..!

    ముఖ్యంగా రాజధాని విషయంలో ఆయన వర్షన్ హిపోక్రసీతో నిండిపోయింది. అమరావతి ఏర్పాటు, భూసేకరణ విషయంలో చంద్రబాబు తప్పుచేశారు అన్నారు. అన్ని వేల ఎకరాల సేకరణ మేము అప్పట్లోనే తిరస్కరించాం అన్నారు. సేకరించిన భూమి అభివృద్ధి జరగకపోతే సమస్యలు తప్పవని హెచ్చరించినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాజధానిని చీల్చవలసిన అవసరం లేదు అన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేయడం తగదని చెప్పడం జరిగింది.

    Also Read: ఓట్లు లేవు.. పార్టీకి నేతల పోట్లు మాత్రం ఉన్నాయి

    ఐతే 2014లో బాబు అధికారంలోకి రాగానే రాజధాని ఏర్పాటు కోసం ఏర్పడిన కమీటీ రిపోర్ట్ కి వ్యతిరేకంగా అమరావతిని రాజధాని ప్రాంతం ప్రకటించారు. నిపుణుల కమిటీ నివేదికకు వ్యతిరేకంగా అమరావతిలో రాజధాని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని పవన్ బాబుని ప్రశ్నించలేదు. నరేంద్ర మోడీతో పాటు 2015లో అమరావతి శంకుస్థాపనలో పాలుపంచుకున్న పవన్ ఎప్పుడూ బాబు భూసేకరణకు వ్యతిరేకంగా మాట్లాడాడో ఆయనకే తెలియాలి. వేల ఎకరాల భూసేకరణ జరుగుతున్నప్పుడు పవన్ టీడీపీ మిత్రుడుగానే ఉన్నారు. అప్పుడు పవన్ రాజధాని భూములు మరియు రైతుల గోడుపై స్పందించలేదు. ఇక అక్కడ రైతుల హక్కులను కాపాడాలి అని అంటున్న పవన్ ఒకప్పుడు అమరావతి ఒక ఎక్స్ క్లూసివ్ క్యాపిటల్, అది ఒక వర్గ ప్రజల ప్రయోజనాలకు ఉద్దేశించే అని అన్నారు. బాబు రాజధాని విషయంలో తప్పు చేశాడు అని అంటున్న మీరు, ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్నారన్న విషయం మరచిపోతే ఎలా. తాజా వ్యాఖ్యలు రాజధాని రైతులపై పవన్ చిత్త శుద్ధి ఏమిటో తెలియజేస్తుంది.