https://oktelugu.com/

తెలుగు వెబ్‌ సిరీస్‌లా.. అయితే ఓ కండీషన్.. సమంత!

సౌత్‌ ఇండియాలో ఇప్పుడు విపరీతమైన పాపులారిటీ, ఫాలోయింగ్‌, డిమాండ్‌ ఉన్న కథానాయికల్లో సమంత అక్కినేని ఒకరు. ‘ఏం మాయ చేశావే’ అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన సమంత తన కెరీర్ను జాగ్రత్తగా నిర్మించుకుంది. ఎలాంటి ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి తక్కువ టైమ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అక్కినేని నాగచైతన్యతో లవ్‌ మ్యారేజ్‌ తర్వాత కూడా ఆమె సినిమాలకు దూరం కాలేదు. అక్కినేని కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత ఆమె కెరీర్ మరింత ఊపందుకుందని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 25, 2020 / 10:23 AM IST
    Follow us on


    సౌత్‌ ఇండియాలో ఇప్పుడు విపరీతమైన పాపులారిటీ, ఫాలోయింగ్‌, డిమాండ్‌ ఉన్న కథానాయికల్లో సమంత అక్కినేని ఒకరు. ‘ఏం మాయ చేశావే’ అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన సమంత తన కెరీర్ను జాగ్రత్తగా నిర్మించుకుంది. ఎలాంటి ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి తక్కువ టైమ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అక్కినేని నాగచైతన్యతో లవ్‌ మ్యారేజ్‌ తర్వాత కూడా ఆమె సినిమాలకు దూరం కాలేదు. అక్కినేని కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత ఆమె కెరీర్ మరింత ఊపందుకుందని చెప్పొచ్చు. పెళ్లయ్యాక నటనలో, పాత్రల ఎంపికలో మరింత పరిణతి కనబరుస్తుందామె. ఈ క్రమంలో రంగస్థలం, మహానటి, యూ టర్న్, సూపర్ డీలక్స్‌, మజిలీ, ఓ బేబీ, ఓకే జాను…. వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటించింది. తన నటనతో ఆయా పాత్రకు ప్రాణం పోసింది. కరోనా కారణం షూటింగ్స్‌కు బ్రేక్‌ రావడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన ఇంటికే పరిమితమైంది అక్కినేని కోడలు. భర్త నాగచైతన్య, పెంపుడు కుక్క హాష్‌తో కలిసి ఈ బ్రేక్‌ను చక్కగా ఆస్వాదిస్తోందామె. జిమ్‌లో వర్కౌట్స్‌, సేంద్రీయ కూరగాయాలు పండిస్తూ… వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటోందామె.

    Also Read: విజయ్ బిజినెస్ స్పీడ్ ఏ హీరోకి లేకపాయే !

    ప్రొఫెషనల్‌ పరంగా రీసెంట్‌గా ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సౌత్‌లో స్టార్డమ్‌ తెచ్చుకున్న సమంత హిందీ వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’లో నటించింది. చిత్రీకరణ పూర్తయిన ఈ సిరీస్‌ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. రెండు నెలల్లో అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ ఫస్ట్‌ పార్ట్‌ భారీ విజయం సాధించింది. సెకండ్‌ సిరీస్‌లో సమంత నెగెటివ్‌ రోల్‌లో అది కూడా ఓ టెర్రరిస్ట్‌ పాత్రలో కనిపించనుంది. ఇంతటి డేర్ డెసిషన్‌ తీసుకున్న సమంతకు ఇప్పుడు తెలుగు వెబ్‌ సిరీస్‌ల నుంచి విపరీతమైన ఆఫర్లు వస్తున్నాయి. కానీ, తెలుగు వెబ్‌ సిరీస్‌లపై సమంత అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఒప్పుకున్నా ముందుగానే ఆమె ఓ కండీషన్‌ పెడుతోందట. అన్నపూర్ణ స్టూడియోస్‌ లేదా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ప్రొడ్యూస్‌ చేస్తేనే తెలుగు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తానని స్పష్టం చేసిందట. అది కూడా కథ నచ్చితేనే. కథతో సమంతను ఇంప్రెస్‌ చేసి.. ఆమె చెప్పిన కండీషన్స్‌లో చిత్రీకరణ చేసే వెబ్‌ సిరీస్‌ వస్తుందేమో చూడాలి.