Chiru meets Jagan: ఏపీలో థియేటర్లు, టికెట్ రేట్ల వ్యవహారం పై జరుగుతున్న దుమారం పై తాజాగా జగన్ తో మెగాస్టార్ మళ్ళీ రేపు భేటీ కాబోతున్నారు. ఇటీవల ఆయన సీఎంను కలవగా.. సినిమా టికెట్ల విషయంలో గుడ్ న్యూస్ వింటారని భేటీ అనంతరం తెలిపారు. అయితే దానిపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ‘ఏ ఒక్కరో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని.. జగన్‌తో చిరు భేటీ పర్సనల్’ అని తాజాగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు వ్యాఖ్యానించారు.

దీంతో మరోసారి చిరంజీవి సీఎం జగన్‌తో ఈనెల 10న భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. కాగా సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సీఎంను కలవనున్నారు చిరంజీవి. సినిమా టికెట్ల విషయంపై సీఎం తో మళ్లీ చర్చించి.. టికెట్ల వ్యవహారానికి ముగింపు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చిరంజీవి చేరుకోనున్నారు. సీఎం జగన్ ఇప్పటికే చిరంజీవికి అపాయింట్మెంట్ ఇచ్చారని తెలుస్తోంది.
Also Read: సీఎం అయినా ఈ వంగి కాళ్లు మొక్కడం ఏందీ స్వామీ?
కాగా జగన్ తో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ అవుతుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత కొంత కాలంగా చిత్ర పరిశ్రమలో ఏపీలో ఎదుర్కొంటున్న సమస్యలపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరగనుంది. మరి చిరుతో భేటీ తర్వాత వైఎస్ జగన్ ఎలాంటి ప్రకటన చేస్తాడో ?

ఈ మధ్య టాలీవుడ్ కు చెందిన కొందరు మాత్రం ఏపీ ప్రభుత్వంను సమర్థిస్తూ జగన్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అందుకే, టికెట్ల రేట్ల విషయంలో సినిమా జననానికి ఏమైనా మేలు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నాడా ? చూడాలి.
Also Read: దేత్తడి హారిక మొదట్లో ఆ పెద్ద కంపెనీలో జాబ్ చేసిందని తెలుసా..
[…] Nellore Police: చట్టాన్ని కాపాడాల్సిన వారే ఉల్లంఘిస్తే ఎలా? రక్షణ కల్పించాల్సిన పోలీసులకే కష్టం వస్తే ఎక్కడ చెప్పుకోవాలి? ఎవరితో గోడు వెళ్లబోసుకోవాలి? నెల్లూరు పట్టణంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు తెలిస్తే ఆశ్చర్యం వేస్తోంది. మహిళా కానిస్టేబుళ్లకు యూనిఫాం కుట్టే పనిని ఓ జెంట్స్ టైలర్ కు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. దీంతో మహిళా కానిస్టేబుళ్లు ఆందోళన చెందుతున్నారు. మహిళలకు జెంట్స్ టైలర్ ను నియమించడంలో అర్థమేమిటని మండిపడుతున్నారు. తమ గోడును వెళ్లబోసుకునేందుకు ఎవరున్నారని వాపోతున్నారు. […]