spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Liquor Brands: ఏపీ మద్యం బ్రాండ్లకు కేంద్రం షాకిస్తుందా?

AP Liquor Brands: ఏపీ మద్యం బ్రాండ్లకు కేంద్రం షాకిస్తుందా?

Liquor brands in Andhra PradeshAP liquor brands: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మద్యం (Liquor) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నాసిరకం బ్రాండ్లతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు(Raghurama Krishna Raju) కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో వాటిపై పరిశీలన జరిపేందుకు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సమాచారం అందజేశారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్న మద్యం బ్రాండ్లను తీసుకురావద్దని సూచించడంతో కేంద్రమంత్రి చర్యలు చేపట్టారు. ఇదులో భాగంగా ఏపీలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న బ్రాండ్లపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాసిన లేఖతో రాజకీయ దుమారం రేగుతోంది. ఏపీలో మద్యం అమ్మకాలపై కేంద్రం దృష్టి సారించినట్లు సమాచారం. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఏపీలో దర్శనమిస్తున్నాయి. దీంతో వినియోగదారుల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రం కూడా ఇక్కడ దొరికే బ్రాండ్ల గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. విచ్చలవిడిగా ఏపీలో వినియోగంలో ఉన్న బ్రాండ్ల గురించి ఏపీ మాత్రమే శ్రద్ధ తీసుకుంటోంది. వీట వినియోగం ఎక్కడ కూడా కనిపించవు. దీంతో ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మద్యం ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మద్యం ఎక్కువగా ప్రజలు తీసుకోకుండా ఉండడం కోసమే ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కోసమే అని తెలుస్తోంది. ఇష్టమైన బ్రాండ్లు దొరకకపోయినా అందుబాటులో ఉన్న నాసిరకం బ్రాండ్లు ఎక్కువగా ఏపీలో దొరుకుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విచ్చలవిడి మద్యం అరికట్టేందుకు అబ్కారీ శాఖ చర్యలు చేపట్టినా ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మద్యం వినియోగంపై కేంద్రం విచారణ చేపడితే కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. దీంతో అసలైన బ్రాండ్లు అమ్మకుండా నాసిరకం మద్యంతోనే వినియోగదారులను ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖతో ఏపీలో మద్యం పంపిణీలో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జగన్ ప్రభుత్వం కూడా మద్యం వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. నకిలీ మద్యం సరఫరాను అరికట్టి మంచి బ్రాండ్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అసవరం ప్రభుత్వంపై ఉంది. ఇందుకు గాను పటిష్టమైన చర్యలు తీసుకుని మద్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలు, అవినీతికి తావు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెబుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper