
ప్రేమతో అన్నయ్యకు రాఖీ కట్టింది. తర్వాత రెండు గంటల్లోనే ఆ చెల్లెలు శవమై కనిపించింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం విజయవాడ అరండల్ పేటలో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువతి అత్తింట్లో అనుమానాదస్పద స్థితిలో మరణించింది. అత్తింటివారే ఆమె మరణానికి కారకులని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రసాదంపాడుకు చెందిన ఉష (23) రెండేళ్ల క్రితం అరండ్ లో పేటకు చెందిన ఫణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త మెడికల్ రిప్రజెంటేటిగా పని చేస్తుండగా, ఉష సాఫ్ట్ వేర్ ఇంజినీర్. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నావంటూ తన సోదరిని అత్తింటివారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసే వారని ఉష సోదరుడు ఆరోపిస్తున్నారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.