ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాసిన లేఖతో రాజకీయ దుమారం రేగుతోంది. ఏపీలో మద్యం అమ్మకాలపై కేంద్రం దృష్టి సారించినట్లు సమాచారం. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఏపీలో దర్శనమిస్తున్నాయి. దీంతో వినియోగదారుల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రం కూడా ఇక్కడ దొరికే బ్రాండ్ల గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. విచ్చలవిడిగా ఏపీలో వినియోగంలో ఉన్న బ్రాండ్ల గురించి ఏపీ మాత్రమే శ్రద్ధ తీసుకుంటోంది. వీట వినియోగం ఎక్కడ కూడా కనిపించవు. దీంతో ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మద్యం ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మద్యం ఎక్కువగా ప్రజలు తీసుకోకుండా ఉండడం కోసమే ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కోసమే అని తెలుస్తోంది. ఇష్టమైన బ్రాండ్లు దొరకకపోయినా అందుబాటులో ఉన్న నాసిరకం బ్రాండ్లు ఎక్కువగా ఏపీలో దొరుకుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విచ్చలవిడి మద్యం అరికట్టేందుకు అబ్కారీ శాఖ చర్యలు చేపట్టినా ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మద్యం వినియోగంపై కేంద్రం విచారణ చేపడితే కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. దీంతో అసలైన బ్రాండ్లు అమ్మకుండా నాసిరకం మద్యంతోనే వినియోగదారులను ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖతో ఏపీలో మద్యం పంపిణీలో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జగన్ ప్రభుత్వం కూడా మద్యం వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. నకిలీ మద్యం సరఫరాను అరికట్టి మంచి బ్రాండ్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అసవరం ప్రభుత్వంపై ఉంది. ఇందుకు గాను పటిష్టమైన చర్యలు తీసుకుని మద్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలు, అవినీతికి తావు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెబుతున్నారు.