Homeజాతీయ వార్తలుKCR- BJP: కేసీఆర్‌ను గెలిపించాలని బీజేపీ భావిస్తోందా?

KCR- BJP: కేసీఆర్‌ను గెలిపించాలని బీజేపీ భావిస్తోందా?

KCR- BJP: సంక్షేమ పథకాల్లో కేసీఆర్‌ను కొట్టలేముం ఆయన తోపు.. తురుము అనే మాటలు తెలంగాణ వ్యాప్తంగా రోజూ వినిపిస్తాయి. మంత్రులు, బీఆర్‌ఎస్‌ నేతలు అదే చెబుతూంటారు. ఇదంతా మామూలే. కానీ ఇప్పుడు బీజేపీ నేతలు కూడా అదే అందుకుంటున్నారు. సంక్షేమ పథకాలల్లో సీఎం కేసీఆర్‌ను కొట్టలేమన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్‌పైనా బీజేపీకి ఫుల్‌ క్లారిటీ వచ్చినట్లు ఉంది. దీంతో ‘కేసీఆర్‌ను కొట్టాలంటే ఆయన ఇచ్చిన హామీలు అమలులో లోపాలతోనే కొట్టాలని.. లేకుంటే కేసీఆర్‌ను ఓడించటం కష్టమం’ అని వ్యాఖ్యానిస్తున్నారు.

సంక్షేమంలో వారిద్దరు తోపు..
సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌.. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ ఒక్కటే అని కూడా సర్టిఫికెట్‌ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు. అధ్యక్షుడి బండి సంజయ్‌ మార్పు కారణంగా బీజేపీ డ్యామేజీ అయిందనడం కరెక్ట్‌ కాదన్నారు. అధ్యక్షుడిని ఎందుకు మార్చారో మార్చిన వాళ్లకు బాగా తెలుసని.. నేతలను కలుపుకుపోవటం లేదనే బండి సంజయ్‌ను తప్పించారని వెల్లడించారు. మురళీధర్‌రావు వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలోనూ కలకలం రేపుతున్నాయి.

గ్రాఫ్‌ పడిపోతున్నా..
బండి సంజయ్‌ను తప్పించింది.. బీఆర్‌ఎస్‌ కోసమని, ఓ వైపు లిక్కర్‌ స్కామ్‌లో కవితను పక్కన పెట్టేసి మరో వైపు పార్టకి ఊపు తెచ్చిన బండి సంజయ్‌ను ఇతర రాష్ట్రాలకు పంపిచేస్తూ సొంత పార్టీని డ్యామేజ్‌ చేసుకుంటూ ఏం సాధిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కిషన్‌రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ కార్యకలాపాలు పూర్తిగా నీరసించి పోయాయి. ఆయనకేంద్ర మంత్రిగా ఉండటంతో ఆ పనుల కోసం తిరగాల్సి వస్తోంది. తెలంగాణలో ఏ ధర్నాలు చేపట్టినా జరుగుతున్నాయో లేదో అనే పరిస్థితికి వెళ్లిపోయింది. ఇప్పటికే పార్టీ గ్రాఫ్‌ వేగంగా పడిపోతోంది. దానికి తోడు.. కేసీఆర్‌ను పొగడ్తల్లో ముంచెత్తే నేతలు నోరు అదుపు చేసుకోలేకపోతూండటంతో మొదటికే మోసం వస్తుంది.

ఎన్నికలకు ముందు ఇంత ప్రణాళిక లేకుండా ఎందుకు తమ నెత్తిపై చేయి పెట్టుకుంటున్నారన్న ఆందోళన సహజంగానే బీజేపీ క్యాడర్‌లో కనిపిస్తోంది. కేసీఆర్‌ను గెలిపించాలని బీజేపీ భావిస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version