Prashant Kishor- Chandrababu Naidu: గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించనున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వలే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని శపథం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అమిత్ షా సామర్థ్యానికి పీకే వ్యూహాలకు పరీక్షగా నిలుస్తోంది. అమిత్ షా కూడా పలుమార్లు పీకే వ్యూహాలపై పెదవి విరిచారు. పీకే కూడా అధికారంలో ఉన్నప్పుడు కాదు అధికారంలో లేనప్పుడు సత్తా చూపించాలి అని చాలెంజ్ చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. దీంతో ఇద్దరి శక్తులకు ప్రతీకగా గుజరాత్ ఎన్నికలు నిలిచే అవకాశముంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల కోసం చంద్రబాబు తపిస్తున్నారు. జగన్ కు కూడా పీకేనే సారధ్యం వహిస్తారని టాక్ రావడంతో గుజరాత్ లో పీకే అనుకున్న ది సాధిస్తే ఏపీలో ఫలితాలు మారతాయి. దీంతో పొత్తు విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు గుజరాత్ ఫలితాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఒక వేళ గుజరాత్ పీకే వ్యూహాలు ఫలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. లేదంటే బీజేపీ పాగా వేస్తుంది. బీజేపీ గెలిస్తే పొత్తుల గురించి పట్టించుకోదు. ఓటమి చెందితే మాత్రం ఏపీలో కూడా పొత్తు కోసం చంద్రబాబును సంప్రదించే అవకాశముందనేది ఆయన ఆశ.
Also Read: KCR Politics on Petrol Price Hike: పెట్రోల్ ధర తగ్గాలంటే ఏం చేయాలి?
ఈ నేపథ్యంలో బీజేపీ గెలుపోటములపై చంద్రబాబు భవితవ్యం ఆధారపడి ఉంది. బాబుకు ఈసారి బీజేపీతో కలవాలనే కోరక ఉంది. కానీ గతంలో ఆయన చేసిన తప్పిదాల వల్ల ఆయనకు అవకాశం ఇవ్వరనే విషయం తెలుస్తోంది. అప్పుడు ఎవరో చెప్పిన దాన్ని విని చంద్రబాబు తప్పటడుగు వేశారు. ఫలితం అనుభవిస్తున్నారు. జాతీయ పార్టీ అండ ఉంటేనే రాష్ట్రంలో చంద్రబాబుకు ఉపశమనమనే విషయం ఇప్పటికి తెలిసింది. కానీ ఇప్పుడు బీజేపీ సుముఖంగా లేకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీని ఎదుర్కొనే సత్తా లేదని చెబుతూనే బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణకు పీకే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇప్పట్లో బీజేపీని ఢీకొనడం ఏ పార్టీ వల్ల కాదనే విషయం కుండబద్దలు కొట్టి మరీ మళ్లీ బీజేపీపై పోరాటానికే పీకే ముందుకు రావడం గమనార్హం. ఏది ఏమైనా పీకే వ్యూహాలు కొందరికి వరాలుగా మారనున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు మాత్రం ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పీకే దేవుడిలా కనిపిస్తున్నాడు. అతడి ప్రయత్నాలు సఫలమైతే తనకు రాజకీయ భవిష్యత్ ఉందని బాబు నమ్ముతున్నారు.
గుజరాత్ ఎన్నికలు ఈ సంవత్సరం చివరలో జరగుతాయని తెలిసిందే. ఇక్కడ బీజేపీ గెలిస్తే పీకేను పట్టించుకోదు. కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో పొత్తుకు చంద్రబాబుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు ఇక దైవమే నిర్ణయించాలి. ఏ పార్టీ గెలుస్తుందో ఎవరి ఆశలు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.