CM Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఘనతలు చెప్పుకునేందుకు రెండు పుస్తకాలు ముద్రించింది. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ర్టం సుభిక్షంగా ఎలా మారిందనే విషయాలపై కూలంకషంగా వివరిస్తూ ప్రభుత్వ విజయాలు నమోదు చేసింది. దీనికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందన్న దానిపై స్పష్టత లేదు. గొప్పలు చేయాలి కానీ చెప్పుకోవాలా అని ప్రతిపక్షాలు చెబుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.

ఓ పక్క రాష్ర్టం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. అనవసర ఖర్చులు పెడుతూ ప్రజలపై పెనుభారం మోపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం తీసుకొస్తున్న రెండు పుస్తకాల ఖరీదు బాగానే ఉండేట్లు కనిపిస్తోంది. రాజన్న రాజ్యంలో పథకాలు, వింతలు, విశేషాలతో ప్రభుత్వం తన గొప్పలను పొందుపరిచింది. సుమారుగా ఈ రెండు పుస్తకాలకు దాదాపు వంద కోట్లు ఖర్చవుతుందని ఓ అంచనా.
మొదటి పుస్తకంలో రెండో ఏట ఇచ్చిన మాటకే పెద్దపీట అంటూ మేనిఫెస్టోలోని అంశాలనే చెప్పారు. రైతు భరోసా పథకానికి రూ.13,500 ఎలా ఇస్తున్నారనే దానిపై వివరించారు. అమ్మఒడి వంటి పథకంలో ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాల గురించి తెలియజేశారు. దీంతో ప్రజలకు ఒనగూరే లాభాల గురించి కూలంకషంగా వివరించారు.
Also Read: KCR: కేసీఆర్ ఫ్రస్టేషన్ కు కారణమెంటో తేల్చిచెప్పిన రఘనందన్..!
రెండో పుస్తకంలో సంక్షేమ సంతకం రెండో ఏట ఇచ్చిన మాటకే పెద్దపీట వేసింది. ప్రభుత్వ ఘనకార్యాలకు పుస్తకాలు వేయించడమెందుకని పలువురు విమర్శిస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. రెండు పుస్తకాల్లోనూ జగన్ మాటకే విలువ ఇచ్చారు. పుస్తకాల పంపిణీ అప్పుడే ప్రారంభం అయింది. అన్ని జిల్లాలకు సరఫరా చేస్తోంది.
Also Read: Bandi sanjay : కేసీఆర్ కౌంటర్.. బండి సంజయ్ ఎన్కౌంటర్