Team India: టీ 20 ప్రపంచ కప్ లో టీమిండియా పరాజయాలకు భారీ మూల్యమే చెల్లించుకుంటోంది. పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్లతో జరిగిన మ్యాచుల్లో ఓటమి పాలు కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాపై విమర్శల జల్లు కురుస్తోంది. దీనిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. కోహ్లి సేన పరాజయంపై మాట్లాడారు. టీమిండియా ఓటమికి టాస్ కారణం కాదన్నారు. పాక్, కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారు. అందుకే ఆ జట్లు విజయాలు అందుకున్నాయి.

పాక్, కివీస్ బౌలర్ల ధాటికి మన బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి భయపడ్డారు. దీంతో ఆ జట్లు పరుగులు దక్కించుకుని విజయం సాధించాయి. తొలి రెండు ఆటల్లో టీమిండియా విఫలం కావడంతోనే ఎదుటి జట్లు మేల్కోవడంతోనే మన జట్టు డీలా పడింది. దీంతో మనం విజయం సాధించలేకపోయాం. ఈ నేపథ్యంలో టీమిండియాపై విమర్శలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.
టైటిల్ ఫేరవేట్ గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలను అందుకోలేకపోయింది. కనీసం సెమీస్ కు కూడా చేరలేకపోయింది. దీంతో కెప్టెన్ కోహ్లిపై అభిమానులు విమర్శలు చేశారు. వ్యక్తిగత స్థాయికి వెళ్లి దిగజారడం బాధాకరం. టోర్నీ నుంచి ఏం సాధించకుండానే నిష్ర్కమించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టు సెమీస్ కు కూడా చేరకుండా వెనుదిరగడం ఇదే ప్రథమం.
Also Read: PV Sindhu: మరో ‘పద్మం’ అందుకున్న పీవీ సింధు..!
టీమిండియా భారత అభిమానులను నిరాశకు గురిచేసింది. టైటిల్ పోరులో వెనుకబడిపోయింది. గెలవాల్సిన మ్యాచులు ఓడి టోర్నీ నుంచి బయటకు వచ్చింది. చివరి ఆటను పసికూన నమీబియాతో ఆడుతోంది. నమీబియాపై భారీ స్కోరు చేసి పోయిన పరువును నిలబెట్టుకోవాలని భావిస్తోంది. కానీ కెప్టెన్ కోహ్లి మెరుగైన ప్రదర్శన చేసినా మిగతా ఆటగాళ్లు రాణించకపోవడంతోనే టీమిండియా ఓటమి పాలు కావడం తెలిసిందే.
Also Read: T20 World Cup: పసికూనపై ప్రతాపం చూపించేందుకు టీమిండియా రెడీ