Character Artist Hema: సినీ పరిశ్రమకు ( cinema industry) చెందిన చాలామంది వ్యక్తులు రాజకీయాల్లో రాణించారు. అయితే అందులో సక్సెస్ అయిన వారు కొంతమందే. ఆర్కే రోజా రాజకీయాల్లోకి వచ్చి మంత్రి స్థాయికి ఎదిగారు. ఆపై పవన్ కళ్యాణ్ సైతం ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు సైతం ఎమ్మెల్సీ అయ్యారు. వైసీపీ హయాంలో పోసాని కృష్ణ మురళి, అలీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తదితరులు నామినేటెడ్ పదవులు అనుభవించారు. అయితే చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తులు వివాదాస్పద ముద్రను చాటుకున్నారు. అయితే కొంతమంది ఇలా వచ్చి అలా మళ్లీ సినీ పరిశ్రమలోకి వెళ్ళిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్, నటిగా గుర్తింపు తెచ్చుకున్న హేమ రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తోంది. ఇటీవల తన మనసులో ఉన్న మాటను కూడా ఆమె బయటపెట్టారు.
డ్రగ్స్ కేసులో ఇరుక్కుని..
కామెడీ పరంగా కూడా చాలామంది మహిళ నటీమణులు రాణించారు. అందులో హేమ కూడా ఒకరు. గత కొంతకాలంగా ఆమె సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. డ్రగ్స్ కేసులో( drugs case) ఇరుక్కున్నారు. జైలుకు కూడా వెళ్లారు. ఇటీవల ఆమెకు క్లీన్ చీట్ లభించింది. అయితే ఇప్పుడు ఆమె మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ కు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకుగాను పవన్ కళ్యాణ్ ను కలుస్తానని చెబుతున్నారు. పనిలో పనిగా తన రాజకీయ ఆసక్తి, తన అభిలాషను సైతం పవన్ కళ్యాణ్ కు వివరిస్తానంటున్నారు. త్వరలో జనసేనలో చేరుతానని కూడా హింట్ ఇస్తున్నారు. అయితే ఆమెను జనసేనలోకి తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
నటిగా గుర్తింపు.. గోదావరి ప్రాంతాలకు చెందిన హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. కామెడీ టైమింగ్ ఉన్న నాటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2014 ఎన్నికల్లోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమ పార్టీ నుంచి పోటీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో గోదావరి జిల్లాలో ఓ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసిన హేమ నాలుగువేల వరకు ఓట్లు సొంతం చేసుకున్నారు. అయితే తర్వాత ఆమెకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆమె మాత్రం జనసేనలో చేరుతారని ప్రచారం అన్నది సాగుతోంది. తనకు టీటీడీ బోర్డు మెంబర్ గా ఆసక్తి ఉందని ముందుగానే ప్రకటించుకున్నారట హేమ. చూడాలి ఆమె జనసేనలో చేరుతారా? లేదా? అన్నది