BJP- Amarinder Singh: అద్భుతం జరిగితే తప్ప బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఓడిపోరు. ఎలాగూ మమతా బెనర్జీ కూడా కాళ్ల బేరానికి వచ్చింది. కేసీఆర్ గాంబీర్యం ప్రదర్శిస్తున్నా బీజేపీ పెద్దలు అంత సీరియస్గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. రాష్ట్రపతిగా ముర్ము విజయం లాంచనమైనప్పటికీ.. ఉపరాష్ట్రపతి విషయంలో మోదీ షా పంజాబ్ కెప్టెన్ అమరేందర్ సింగ్ ను దాదాపు ఖాయం చేసినట్టు కనిపిస్తోంది. ఇక ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య స్థానం భారతీయ జనతా పార్టీ మార్గదర్శక మండలి లోకే కావచ్చు. ఆయన కూడా అద్వానీ వంటి వారి సరసన చేరవచ్చు. టీఆర్ఎస్, ఇతర కుల మీడియా సంస్థలు “దక్షిణాది’ అగ్గి మండించినా అమిత్ షా మోదీ అసలు బెదరకపోవచ్చు. తెలుగు నినాదం, నిలువెత్తు పంచ కట్టు, నెల్లూరు ఆహార్యం వంటి నినాదాలు ఇక పని చేయకపోవచ్చు. మొన్నటి దాకా కేరళ గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ను ఉపరాష్ట్రపతి కుర్చీలోకి ఆహ్వానిస్తారని ప్రచారం జరిగింది. కానీ అది కార్య రూపం దాల్చలేదు. వాస్తవానికి బీజేపీ కోణంలో చూస్తే ప్రస్తుతం పంజాబ్ సిక్కులకు, కాశ్మీరీ ముస్లింలకు ఉపశమనం కలిగించాల్సిన పరిస్థితి. కానీ ఆ దిశగా మోదీ షా ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. మొన్నటిదాకా గులాం నబీ ఆజాద్ ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేస్తారని వ్యాఖ్యలు వినిపించాయి. కానీ అంతలోనే చప్పబడ్డాయి. ఇన్ని విశ్లేషణల మధ్య తాజాగా పంజాబ్ కెప్టెన్ అమరేందర్ సింగ్ వైపు మోదీ షా మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది.

అమరేందర్ ఎందుకంటే
అనుమానం అక్కర్లేదు. ఇప్పుడు ఉన్నది ఒకప్పటి బీజేపీ కాదు. తమలపాకుతో ఒకటి ఇస్తే తలుపు చెక్కలతో రెండు ఇచ్చే టైపు. అప్పటి నాయకులు లేరు. అప్పటి విధానాలూ లేవు. ఇప్పుడు బీజేపీలో మోదీషా ఏం చెప్తే అదే జరుగుద్ది. నిన్నటికి నిన్న మహారాష్ట్రలో ఏం జరిగిందో చూశాం కదా! ఇంతకు మించిన ఉపమానాలు కానీ కొలమానాలు కానీ ఇక అక్కర్లేదు. 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా కూడా మోడీకి, షా కు ఎక్కడో వెలితి. ఢిల్లీకి దగ్గరకి దారి అయిన ఉత్తర్ ప్రదేశ్ ను మరోసారి గెలుచుకున్నా తృప్తి లేదు. రోజురోజుకు ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీనికి తోడు ఖలిస్తాన్ వేర్పాటు వాదులు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఇటీవల పంజాబ్ పర్యటనకు మోదీ వెళ్లినప్పుడు ఖలిస్తాన్ ఏర్పాటు వాదులు నిలువరించారు.
Also Read: NagaBabu : జనసేన వీరమహిళలను చూసి నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్
“చావు చివరి అంచుల దాకా వెళ్లి బతికి బయటపడ్డానని” మోడీ వ్యాఖ్యానించడం, “మీ సీఎం చన్నీకి చెప్పండి నేను క్షేమంగా బయటపడ్డానని” అధికారులతో చెప్పడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. వాస్తవానికి మోడీ ఒక టిపికల్ క్యారెక్టర్. ఎవరికి ఒక పట్టానా అంతుపట్టడు. గోద్రా అల్లర్ల కేసులో ఏ సోనియా గాంధీ అయితే తనను సిట్ ముందు నిలబెట్టారో.. నేషనల్ హెరాల్డ్ కేసులో అదే సోనియాగాంధీని, రాహుల్ గాంధీని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఇక ఖలిస్తాన్ వేర్పాటు వాదుల వల్ల ఢిల్లీలో జరిగిన ఉద్యమం, దాని పర్యవసానాల వల్ల మోడీ రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న మోడీ ప్రస్తుతం సిక్కుల ప్రేమ చురగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అమరేందర్ సింగ్ ను దాదాపు ఖాయం చేసినట్టు తెలుస్తోంది.
ఎవరు ఈ అమరీందర్?
అమరీందర్ సింగ్.. పంజాబ్లోని పాటియాలాలోని రాజ కుటుంబానికి చెందిన వాడు. మాజీ సైనికుడు. తాత, తండ్రి కూడా సైనికులే. తన కుటుంబ ఆర్మీ నేపథ్యాన్ని మీసాలు మేలేసుకుంటూ చెప్పేంత గొప్ప చరిత్ర ఉన్నవాడు. రాజీవ్ ప్రోద్భలంతో అనుకోని పరిస్థితిలో కాంగ్రెస్లో చేరాడు. స్వర్ణ దేవాలయంలో సైనిక దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు. అంతేనా మొన్న పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఖాళీ చేసిన ఎంపీ స్థానంలో గెలిచిన అరివీర ఖాలిస్తాన్ వేర్పాటు వాది సిమ్రన్జీత్ మాన్ స్వయానా అమరీందర్ సింగ్ కు తోడల్లుడు. ఇక అమరీందర్ భార్య ప్రణీత్ కౌర్ ఓసారి ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా చేసింది. ఈ దేశానికి సుదీర్ఘకాలం విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన నట్వర్ సింగ్ భార్య హేమీందర్ సింగ్ స్వయానా అమరీందర్ సింగ్ కు సోదరి. అప్పట్లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అమరీందర్ సింగ్ శిరోమణి అకాలీదళ్ ( పాంథర్) పార్టీని స్థాపించాడు. తర్వాత దానిని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. కాంగ్రెస్ తనను సీఎం పోస్టు నుంచి తొలగించాకా పంజాబ్ లోక కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించాడు. ఇప్పుడు దానిని బీజేపీలో విలీనం చేయబోతున్నాడని ఒకటాక్.

ప్రేమ వ్యవహారంలోనూ గట్టివాడే..
పుట్టింది రాజపుట్టుక. దీంతో అమరీందర్ సింగ్ ఆ రాజసాన్ని అణువణువు ప్రదర్శించేవాడు. ఇదే సమయంలో పాకిస్థానీ డిఫెన్స్ జర్నలిస్టు అరుసా అలంతో ప్రేమలో పడ్డాడు. ఒకసారి ఇండియాకు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది. అది కాస్త సంథింగ్ సంథింగ్ కు దారి తీసింది. అమరీందర్ సింగ్ సీఎం కుర్చీలో ఉంటే అరుసా అలం ను “ఫస్ట్ లేడీ ఆఫ్ పంజాబ్” అని పిలిచేవారు. చాలామంది కూడా ఆమె చల్లని కరుణ కోసం పడి చచ్చిపోయే వాళ్ళు. సీఎం పోస్ట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె కూడా తెగ బాధ పడిపోయింది. మేము ఇద్దరం సోల్మెట్స్ అంటూ మీడియా ఎదుట బాధపడిపోయింది.
ఇప్పుడే ఎందుకు?
విదేశీ నిధులతో ఖలిస్తాని ఏర్పాటు వాదం అంతకంతకు వేళ్ళూనుకుంటున్నది. పైగా మొన్న పంజాబ్లో ఆప్ అధికారంలోకి రావడానికి ఈ ఖలిస్తానీ వేర్పాటు వాదులు తీవ్రంగా కృషి చేశారని ఆరోపణలు ఉన్నాయి. మొన్న మోదీ పంజాబ్ వెళ్ళినప్పుడు కూడా వీళ్లే ఆయన అడ్డుకున్నది. ఆమధ్య ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమాన్ని కూడా వీళ్లే చేతిలోకి తీసుకున్నది. ఇది మునుముందు ఎటువైపు దారితీస్తుందో తెలియదు. పంజాబ్ ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత బీజేపీ కి ఇప్పుడు అర్జెంటుగా సిక్కుల ప్రేమ కావాలి. అది అమరీందర్ ద్వారా పొందాలని చూస్తోంది. అంతేనా ఇంకేమైనా ఉందా? అజిత్ దోవల్ ఇచ్చే నివేదికలే ఇప్పుడు మోడీ షాకు అత్యంత ప్రామాణికం. అమరీందర్ ద్వారా ఖలిస్తానీలకు చెక్ పెడితే బీజేపీ ఖాతాలో 20వ రాష్ట్రం చేరినట్టే.
Also Read:PM Modi Tweet: తెలంగాణకు రాగానే మొదలుపెట్టిన మోడీ!
[…] […]