J-Brand Liquor: ఏపీలో ‘జే’ బ్రాండు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. అధిక ధరలకు విక్రయాలపై మండిపడుతున్నాయి. అయితే ఇదంతా మందబాబులకు మద్యం దూరం చేయవచ్చన్న ఆలోచనే తప్పించి ఇందులో ప్రభుత్వం స్వార్థం ఏమీ లేదని ఇన్నాళ్లూ అధికార పక్షం వారు చెప్పుకొస్తున్నాయి. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ పెద్ద స్టింగ్ ఆపరేషనే చేసింది. కొన్ని నాసిరకం బ్రాండ్ల శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు తీసుకెళ్లి పరీక్షలు చేయించింది. వాటిలో విష రసాయనాలు ఉన్నట్టు తేలింది. దీనిపై ఆధారాలతో సహా టీడీపీ నేతలు విలేఖర్ల సమావేశం నిర్వహించి మీడియాకు వివరించారు. దీంతో ఆ తరువాత రోజు నుంచే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆ బ్రాండ్లు కనిపించలేదు. దీంతో ఆ బ్రాండ్లలో విషపదార్థాలు ఉన్నట్టు ఒప్పుకున్నట్టయ్యింది. కానీ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ప్రకటన అంటూ ఏమీ చేయలేదు. అటు అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు కూడా ఇది తమ పనికాదన్నట్టు తప్పించుకున్నారు.

కొత్తగా పిట్ట కథలు..
ప్రభుత్వం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని భయపడి కొత్తగా మద్యం తయారీదారుల పేరిట ఒక సంఘాన్ని తెరపైకి తెచ్చింది. వారందర్నీ పిలిచి మీడియా సమావేశం నిర్వహించింది. కొత్తగా టీడీపీ బయటపెట్టిన విష పదార్థాల విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా విలేఖర్ల సమావేశం సాగింది. వారంతా కొత్తకొత్తగా కథలు చెప్పారు. మీడియా ప్రతినిధులు అడిగి ప్రశ్నాలకు సమాధానం ఇవ్వకుండా.. పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. తాము సరఫరా చేసే మద్యానికి ధర సరిపోకపోయినా.. ప్రభుత్వం నచ్చజెప్పడంతో తాము ముందుకొచ్చామని చెప్పారు. తాము అందిస్తున్నది బ్రాండెడ్ మద్యం అని.. అందులో విష రసాయనాలు ఉండే అవకాశమే లేదన్నారు. కోడ్లు స్క్వాన్ కాకపోవడం వల్లే చాలావరకూ బ్రాండ్ల అమ్మకాలు చేపట్టడం లేదన్నారు. ఎయిర్ టెల్ సిగ్నల్ లేకపోవడంతో స్కానింగ్ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.
Also Read: BJP- Amarinder Singh: సిక్కుల ప్రేమ కోసం బీజేపీ ఏం చేస్తుందో తెలుసా?
అయితే విలేఖర్ల సమావేశంలో ఎక్కడా టీడీపీ ఆరోపణలు గురించి,, విష రసాయనాల నిర్థారణ గురించి ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. నష్టానికి ఎందుకు మద్యం సరఫరా చేస్తున్నారని విలేఖర్లు అడిగి ప్రశ్నకు సమాధానం లేదు. ఊరు పేరు లేని బ్రాండ్లు ఎందుకు అమ్ముతున్నారని అడిగినా మౌనమే సమాధానమైంది. అయితే టీడీపీ నివేదికతో ప్రభుత్వ పెద్దలు జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. అందుకే అప్పటికప్పడు రూపొందించిన తయారీదారుల సంఘం ప్రతినిధులు కూడా పిట్ట కథలతో మరింత అనుమానాలను పెంచేశారు. కానీ తప్పుడు మద్యం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నట్టు మాత్రం వెల్లడైంది. మున్ముందు ఇది రాజకీయ అంశంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం మారితే మాత్రం తప్పుడు మద్యం బ్రాండ్ తయారీదారులు, వారికి వెన్నుదన్నుగా నిలిచిన వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది.
ఆది నుంచి విమర్శలే..
వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత మద్యం పాలసీ మసకబారింది. అప్పటివరకూ ఉన్న ప్రైవేటు విధానాన్ని స్వస్తి పలుకుతూ కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఏడాదికి 25 శాతం షాపులు తగ్గించి.. నాలుగేళ్లకు పూర్తిగా మద్యం దుకాణాలను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ద్రుష్ట్యా మద్యం అమ్మకాలు అనివార్యంగా చెప్పుకొచ్చింది. అంతవరకూ బాగానే ఉంది కానీ.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రకరకాల కొత్త బ్రాండ్లను తెరపైకి తెచ్చింది. గతంలో ఎన్నడూ వినని పేర్లతో మద్యం బ్రాండ్లు దర్శనమిచ్చాయి.

పక్క రాష్ట్రాలతోపోల్చుకుంటే ధర కూడా గణనీయమే. ఇదేమని ప్రశ్నిస్తే మద్యంను మందుబాబులకు దూరం చేయడానికి ధర పెంచినట్టు వక్రభాష్యం చెప్పింది. మరోవైపు రిటైల్ అవుట్ లెట్ల పేరిట మద్యం షాపులకు అనుమతిచ్చింది. బార్లను సైతం తెరిచింది. పర్యాటక ప్రాంతాల్లో సైతం ఏర్పాటుచేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేపడుతోంది. అయితే ఎక్కడా నాణ్యమైన బ్రాండ్లు లభించడం లేదు. ప్రభుత్వ పెద్దల కంపెనీల నుంచే ఇవన్నీ వస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కొన్ని బ్రాండ్ల మద్యాన్ని పరీక్షించగా విష పదార్థాలున్నట్టు తేలింది. అయితే దీనిని నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం కుంటి సాకులు వెతుకుతోంది.
Also Read:NagaBabu : జనసేన వీరమహిళలను చూసి నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్
[…] Also Read: J-Brand Liquor: ఆ బ్రాండ్ మద్యంలో విషపదార్థాలు… […]