Nagarjuna: తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ చేసే ప్రతి సినిమా చాలా వైవిధ్యమైన కథాంశాలతో తెరకెక్కుతూ ఉంటాయి. అందువల్ల ఆయన చేసిన మొదటి సినిమా నుంచి చివరగా చేసిన లియో సినిమా వరకు ప్రతి సినిమా కూడా ఆయనను డైరెక్టర్ గా మరొక మెట్టు పైకి ఎక్కిస్తూనే ఉన్నాయి. ఇక ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలా మంది ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఆయన సినిమా మీద విపరీతమైన క్రేజ్ ఉంటుంది.అయితే ఆయన కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమా పాన్ ఇండియా లో భారీ సక్సెస్ అవ్వడమే కాకుండా లోకేష్ కనకరాజు కి భారీ ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది. మరి ఇప్పుడు ఆయన రజనీకాంత్ తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా కోసం ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాని ఆయన చాలావరకు చాలా ప్రస్టేజియస్ మూవీగా చేస్తున్నాడు. ఎందుకంటే ఇంతకు ముందు చేసిన లియో సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించకపోవడంతో ‘లోకేష్ కనకరాజ్’ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఆయనను తక్కువ అంచన వేసిన వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి ఈ సినిమాని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా అక్కినేని నాగార్జునని తీసుకున్న విషయం మనకు తెలిసిందే…అయితే నాగార్జునకు సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నప్పటికీ ఆయన వాటి వేటిని పట్టించుకోకుండా తన సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు… నిజానికి నాగార్జునని ఈ సినిమాలో విలన్ గా తీసుకోవాలనే ఆలోచన తనకు ఎలా వచ్చింది అనే దాని మీద పలు ప్రశ్నలైతే వస్తున్నాయి. అయితే యాక్చువల్ గా నాగార్జున చాలా కూల్ గా డీసెంట్ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు.
ఇక అలాంటి ఒక వ్యక్తిని డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపిస్తే ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తుందనే ఉద్దేశ్యం తోనే ఆయన విలన్ పాత్ర కోసం నాగార్జునని సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి నాగార్జున, రజనీకాంత్ ఇద్దరి మధ్య వచ్చే సీన్లు సినిమా మొత్తానికి హైలైట్ గా నిలువ బోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే లోకేష్ కనకరాజు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొడతానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు…