BJP- TRS Leaders: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పాలనపై ఆ పార్టీ నేతలకే విరక్తి పుట్టిందా.. కేసీఆర్ ఒంటెత్తు పోకడతో విసిగిపోయారా.. క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉన్నా.. గులాబీ బాస్ స్థానిక నేతలను లెక్క చేయడం లేదా.. అందుకే వారు టీఆర్‌ఎస్ సర్కార్ కూలిపోవవాలని భావిస్తున్నారా.. అంటే అవుననే అంటున్నారు కే ంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఆ పార్టీకి చెందిన కొంతమంది ముఖ్య నేతల్లో టీఆర్‌ఎస్ పాలనపై విరక్తితో ఉన్నారని పేర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారాయి. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌లో చర్చకు దారితీశాయి.

బీజేపీపై దాడి అందుకే..
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్ర నాయకులకు శిక్షణ తరగతులను నిర్వహిస్తోంంది. హెదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని షామీర్‌పేట్‌లో ఉన్న లియోనియా రిసార్ట్‌లో శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. మూడు రోజుల పాటు సాగనుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయడంతోపాటు, కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్ అసత్య ప్రచారాలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ నేతలు కృషిచేయాలని పేర్కొన్న ఆయన వచ్చే ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన పనులు గురించి చెప్పుకోవడానికి టీఆర్‌ఎస్ పార్టీ వద్ద ఏమీ లేవని, అందుకే బీజేపీపై ఎదురుదాడి చేస్తోందని కేంద్ర మంత్రి విమర్శించారు.
బీజేపీ పాలన కోరుకుంటున్నారు..
టీఆర్‌ఎస్ పార్టీలో కొంతమంది నేతలు, కార్యకర్తలు, బ్యూరోక్రాట్లు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మార్పు తప్పనిసరిగా కనిపిస్తుందని పేర్కొన్న ఆయన కేవలం అభద్రతా భావంతోనే టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిపోతే సంక్షేమ పథకాలను అమలు చేయమని ప్రజలను భయపెట్టిందని తెలిపారు. ప్రలోభపెట్టి గెలిచిందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీని విమర్శిస్తే స్థాయి పెరుగుతుందా?
ప్రధాని మోదీని విమర్శిస్తే తన స్థాయి పెరుగుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని విమర్శించారు. బీజేపీపై ఒత్తిడి తీసుకురావడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఫైల్స్ పూర్తిగా కేసీఆర్ స్క్రిప్ట్ అని స్పష్టం చేశారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో.. ఎవరు పార్టీ అధ్యక్షుడు అవుతారో చెప్పలేమని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో అవకాశం లభిస్తుందని తెలపారు.