Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన సమస్యలు అలాగే ఉంటున్నాయి. దీంతో పాలకుల్లో కనీస బాధ్యత కూడా కరువవుతోంది. ఫలితంగా ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉండటం చూస్తూనే ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అయినా, పోలవరం గురించైనా అమరావతి రాజధాని వ్యవహారమైనా ఏళ్లుగా పెండింగులోనే ఉంటున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కలుగుతున్నా పాలకుల్లో మాత్రం మొండి వైఖరి మాత్రం వీడటం లేదు. ఫలితంగా అవి పరిష్కారం కాని సమస్యలుగానే వినతికెక్కుతున్నాయి. కానీ వాటికి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత తమ మీద ఉందనే అవసరం మాత్రం గుర్తించడం లేదు.
విశాఖ స్టీల్ వ్యవహారంలో ఎన్నో ఏళ్లుగా కేంద్రం దాన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెబుతున్నా పార్టీల్లో మాత్రం చలనం లేకుండా పోతోంది. కేంద్రాన్ని నిలదీసేందుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదు. దీంతో అది పరిష్కారానికి నోచుకోకుండా పోతోంది. ఈ నేపథ్యంలో దీనిపై అన్ని పార్టీలు గళమెత్తినా ప్రస్తుతం మాత్రం మెత్తబడ్డాయి. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడం లేదు. దీంతో కార్మికుల్లో అసహనం పెరిగిపోతోంది. అసలు విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయడం ఖాయమేననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
అమరావతి రాజధాని వ్యవహారం కూడా కొలిక్కి రావడం లేదు. మూడు రాజధానుల వ్యవహారాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నా దానిపై మళ్లీ జీవో తెస్తామని జగన్ చెబుతుండటంతో ప్రజ్లలో మరోమారు ఆందోళన నెలకొంటోంది. అమరావతి రాజధానిగా చేసే వరకు విశ్రమించేది లేదని తెగేసి చెప్పిన తెలుగుదేశం పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. ఫలితంగా దీనిపై క్లారిటీ రావడం లేదు. ఫలితంగా ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యగానే గుర్తింపు పొందుతోంది.
Also Read: కొత్త జిల్లాలతో ప్రయోజనాలుండేనా..జగన్ సర్కార్‌పై భారం తప్పదా..?
ఆంధ్రుల కలల ప్రాజెక్టు పోలవరం. ఇది కూడా కొద్ది ఏళ్లుగా పెండింగులోనే ఉంటోంది. దీంతో ప్రజల కల సాకారం కావడం లేదు. దీంతో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పనులు మాత్రం పూర్తి కావడం లేదు. ఫలితంగా పోలవరం ప్రజల కంట కలలవరంగానే మిగిలిపోతోంది. దీని పూర్తికి కూడా బడ్జెట్ కేటాయించాలని కోరుతున్నా అది సాధ్యం కావడం లేదు. ఫలితంగా పోలవరం పరిష్కారానికి నోచుకోకుండా అలాగే ఉండిపోతోంది. ప్రతిసారి ఎన్నికల నినాదంగా మాత్రం పని చేస్తోంది. రాబోయే ప్రభుత్వాలకు పోలవరం ఓ మైలురాయిగా మారిపోతోందని చెప్పవచ్చు.
వీటిపై పాలకులు మాత్రం మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలో ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉంటున్నాయి. ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో పార్టీలకు ఇవే ప్రచార సాధనాలుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఈ సమస్యలు ఇలాగే ఉండి రాబోయే ప్రభుత్వానికి ఓటు బ్యాంకుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.