Bangarraju: అక్కినేని నాగార్జున – నాగచైతన్య కలయికలో వచ్చిన ‘బంగార్రాజు’ భారీ అంచనాల మధ్య వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టలేక పోయినా ఓ కోణంలో మంచి కలెక్షన్స్ నే రాబడుతున్నాడు. ఈ సినిమా రిలీజ్11 రోజులు అవుతున్నా ఇంకా బాగానే కలెక్ట్ చేసింది. మొత్తమ్మీద కలెక్షన్స్ విషయంలో ‘బంగార్రాజు’ ఏ మాత్రం తగ్గ లేదు. నిజానికి ఈ సినిమా కేవలం బ్రేక్ ఈవెన్ కిందే రిలీజ్ అయింది. సినిమాని ముందే జీ5 కి అమ్మేసుకున్నారు. అందుకే, ఫస్ట్ డే నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడుస్తోంది. మరి లేటెస్ట్ కలేక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Alao Read: మరో క్రేజీ అప్ డేట్.. కొరటాల సినిమాలో చరణ్ ?
ఈ చిత్రం 11 రోజుల కలెక్షన్ల వివరాలను ఒకసారి గమనిస్తే :
గుంటూరు 3.23 కోట్లు
కృష్ణా 2.10 కోట్లు
నెల్లూరు 1.80 కోట్లు
నైజాం 8.02 కోట్లు
సీడెడ్ 7.11 కోట్లు
ఉత్తరాంధ్ర 4.70 కోట్లు
ఈస్ట్ 3.87 కోట్లు
వెస్ట్ 2.75 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 33.58 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 3.12 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 36.70 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

‘బంగార్రాజు’ సినిమాకు రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. అంటే.. ఈ సినిమా బయర్లకు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కాగా 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ. 36.70 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 4.21 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టాల్సి ఉంది. కాగా రెండో శుక్రవారం నాడు కూడా ఈ సినిమాకి 0.47 కోట్లకి పైగా షేర్ వచ్చింది. కాకపోతే నైజాంలో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. మొత్తమ్మీద ‘బంగార్రాజు’ ఏవరేజ్ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబడుతుంది. అయితే ఏపీలో బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ‘బంగార్రాజు’ కి అవకాశాలు ఉన్నాయి. నైజాంలో బ్రేక్ ఈవెన్ అవ్వడం మాత్రం కష్టమే. ఒక్కమాటలో ‘బంగార్రాజు’ ఏపీలో గట్టెక్కాడు, నైజాంలో బోర్లా పడ్డాడు !
Alao Read: కొత్త జిల్లాలతో ప్రయోజనాలుండేనా..జగన్ సర్కార్‌పై భారం తప్పదా..?
[…] Samantha: పుష్ప మూవీలో ఐటెం సాంగ్‌తో అదరగొట్టిన సమంత పాపులారిటీ దేశవ్యాప్తంగా ఆమాంతం పెరిగింది. తాజాగా కాయిన్ స్విచ్ కుబెర్ క్రిప్టో యాప్‌కు ప్రచారకర్తగా సామ్ మారింది. ఇప్పటి వరకు క్రిప్టో కరెన్సీ యాప్‌లకు రణవీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా వంటి స్టార్ హీరోలు దేశంలో ప్రచారకర్తలుగా ఉన్నారు. ఇప్పుడు సామ్ వారి సరసన చేరింది. […]