https://oktelugu.com/

AP New Districts: కొత్త జిల్లాలతో ప్రయోజనాలుండేనా..జ‌గ‌న్ స‌ర్కార్‌పై భారం త‌ప్ప‌దా..?

AP New Districts: ఏపీ సర్కారు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నది. 13 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది. దాంతో మొత్తంగా ఇక ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. 1974 ఏపీ జిల్లాల చట్టం ప్రకారం నూతన జిల్లాలను జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేయనున్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, జిల్లాల ఏర్పాటు నిజంగా అంత ఈజీనా అనే ప్రశ్న తలెత్తుతున్నది. […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 26, 2022 / 05:46 PM IST
    Follow us on

    AP New Districts: ఏపీ సర్కారు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నది. 13 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది. దాంతో మొత్తంగా ఇక ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. 1974 ఏపీ జిల్లాల చట్టం ప్రకారం నూతన జిల్లాలను జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేయనున్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, జిల్లాల ఏర్పాటు నిజంగా అంత ఈజీనా అనే ప్రశ్న తలెత్తుతున్నది. కొత్త జిల్లాలయినా లేదా విభజన అనేది చాలా సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియనే.

    AP New Districts

    ఏపీలో అప్పట్లో సమితులు ఉండగా, వాటి స్థానంలో మండలాలను తీసుకొచ్చి అలా అంతా సెట్ కావడానికి దాదాపు పదేళ్ల కాలం పట్టింది. ఆ టైంలో ఎన్నో చోట్ల రికార్డులు గల్లంతయ్యాయి. అయితే, ఎట్టకేలకు ఉన్న వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థలోకి రికార్డులు అయితే మారాయి. కానీ, అంత సులువుగా అయితే పనులు జరగలేదు. కొంత టైం అయితే పట్టింది. జిల్లాల ఏర్పాటు అనేది వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఎందుకంటే జిల్లా అంటే.. ప్రభుత్వ ఉద్యోగులు జిల్లా కేంద్రంలో ఉండాలి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కార్యాలయం, సిబ్బంది, ఇన్ ఫ్ట్రాస్ట్రక్చర్ ఇలా ఒక్కటేమిటీ.. అన్ని రకాల ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

    Also Read: కొత్త జిల్లాలతో ఇక కొత్త వారికి మంత్రి పదవులు

    ఇప్పటికే ఉన్న జిల్లాలో కొన్ని చోట్ల అద్దె భవనాల్లో కార్యాలయాలు నడుస్తుండగా, ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో వాటన్నిటికీ కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంటుంది. పర్మినెంట్ గా ఏర్పాటు చేయడానికి ముందర టెంపరరీగానైనా భవన వసతి, ఇతర ఏర్పాల్లు చేయాల్సి ఉంటుంద. ప్రతీ జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్స్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. వాటికి స్థల సేకరణ, నిధులు, నిర్మాణాలు ఇలా పనులన్నీ కావాలి. ఈ క్రమంలోనే రికార్డులన్నిటినీ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది.

    చాలా కాలంగా ప్రభుత్వం ఉద్యోగాల్లో నియామకాలు జరగడం లేదు. సిబ్బంది రిటైర్మెంట్‌కు దగ్గరవుతున్నారు. ఇటువంటి టైంలో నూతన జిల్లాలు ఏర్పాటు ఒకరకంగా పెద్ద తలనొప్పే అని కొందరు అంటున్నారు. జిల్లా ఏర్పడితే అక్కడ ఉండే ప్రభుత్వం కార్యాలయల్లో విపరీతంగా సిబ్బంది కొరత ఉండొచ్చంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ అధికారులూ కావాలి. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు హడావిడి తంతుగానే కొందరు అయితే భావిస్తున్నారు.

    Also Read: ఎన్టీఆర్ జిల్లా.. ‘జగన్’ మగాడ్రా బుజ్జీ!

    Tags