https://oktelugu.com/

వాళ్లకే టికెట్లా? టీఆర్ఎస్ పుట్టి మునుగుతుందా?

ఆకు నలిపినప్పుడే అసలు వాసన బయటపడేది, అన్నట్లుగా  సర్వే చేస్తే కానీ కార్పొరేటర్లు నీతిమంతులని తెలియలేదట టీఆర్ఎస్ పార్టీకి.  గ్రేటర్ ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థులకే తిరిగి టిక్కెట్లు ఇవ్వాలని దాదాపు నిర్ణయం తీసుకుందట. అంతర్గత సర్వే ఆధారంగా ఈసారి ఎన్నికలకు టిక్కెట్లు కేటాయించాలని టీఆర్ఎస్ చాన్నాళ్ల కిందటే నిర్ణయించిందట. చెప్పినట్టుగానే సర్వే నిర్వహించి, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న కార్పొరేటర్ల లిస్ట్ తయారుచేసిందట. Also Read: టీఆర్ఎస్ లో మేయర్ పీఠం ఆశావహులు వీరే.. సరిగ్గా ఇక్కడే విచిత్రమైన […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2020 / 10:52 AM IST
    Follow us on

    ఆకు నలిపినప్పుడే అసలు వాసన బయటపడేది, అన్నట్లుగా  సర్వే చేస్తే కానీ కార్పొరేటర్లు నీతిమంతులని తెలియలేదట టీఆర్ఎస్ పార్టీకి.  గ్రేటర్ ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థులకే తిరిగి టిక్కెట్లు ఇవ్వాలని దాదాపు నిర్ణయం తీసుకుందట. అంతర్గత సర్వే ఆధారంగా ఈసారి ఎన్నికలకు టిక్కెట్లు కేటాయించాలని టీఆర్ఎస్ చాన్నాళ్ల కిందటే నిర్ణయించిందట. చెప్పినట్టుగానే సర్వే నిర్వహించి, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న కార్పొరేటర్ల లిస్ట్ తయారుచేసిందట.

    Also Read: టీఆర్ఎస్ లో మేయర్ పీఠం ఆశావహులు వీరే..

    సరిగ్గా ఇక్కడే విచిత్రమైన నిర్ణయం తీసుకుంది టీఆర్ఎస్. అలా వ్యతిరేకత ఎదుర్కొంటున్న కార్పొరేటర్లకు మరో ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. వాళ్లు ప్రజల్లో కలియదిరిగి మళ్లీ మద్దతు సంపాదించుకున్నారట. తాజాగా మరోసారి నిర్వహించిన సర్వేలో ప్రజావ్యతిరేకత ఉన్న కార్పొరేటర్లకు కూడా నీతిమంతులని తెలిందట.

    తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ లెక్కకు మించిన హామీలను గుప్పించారు. డల్లాస్, ఇస్తాంబుల్ వంటి నగరాల పేర్లను ప్రస్తావించారు. మీడియా ప్రతినిధులు, అధికారులు కూడా ఆయా నగరాల్లో అభివృద్ధి నమూనాలపై అధ్యయనం చేశారు. అనుకూల మీడియా తెలంగాణ నగరాలు కూడా ఆ నగరాలుగా మారబోతున్నట్లు కథనాలు రాశాయి.

    మొన్నటి వానలతోనే ఆ హామీలు ఎక్కడ దాకా వచ్చాయో తేటతెల్లమైంది. ముంపు ప్రాంతాలు అట్లనే కనిపిస్తున్నాయి. మురుగునీటి వ్యవస్థకు మోక్షం లభించలేదు. మంచినీటి వ్యవస్థ మెరుగుపడలేదు. అక్రమాల పునాదులు కాదు.. గోడలు కూడా ఎక్కడా కూలలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాకపోతే రోడ్డు వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు సాగాయి. ఫ్లైఓవర్లు, మల్టీ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల మీద ఆసక్తి కనబరిచారు. మంత్రుల పర్యటనల్లో నగరవాసుల నోళ్లు మూయించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రతిపక్షాలు గొంతెత్తున్నాయి.

    Also Read: కేసీఆర్ టాప్ సీక్రెట్ మీటింగ్.. కథేంటి?

    మూడు నగరాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లపైనే నెల రోజులుగా మీడియాలో కథనాలు వచ్చేటట్లు చేస్తున్నారు. 85 వేల ఇండ్లు పేదలకు అందజేస్తామంటూ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించనివే అత్యధికం. చాలా ప్రాం తాల్లో ఇండ్ల కేటాయింపు ప్రక్రియను నిలిపివేశారు. దరఖాస్తుదారుల సంఖ్య చాలా ఎక్కువ. ఎంపిక చేస్తే ప్రభుత్వం, టీఆర్ ఎస్ పట్ల ఇండ్లు రాని వారికి వ్యతిరేకత పెరుగుతుందని భయం పట్టుకున్నది.

    గత గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఏకంగా 99 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆంధ్రాప్రజలు కూడా భారీ ఎత్తున టీఆర్ఎస్ కు ఓట్లు వేయడం విశేషం. ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి మరో ముగ్గురు వచ్చి చేరారు. సర్వే పేరిట టీఆర్ఎస్ తీసుకున్న తాజా నిర్ణయంతో, ఈసారి ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చూడాలి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్