https://oktelugu.com/

బిగ్ బాస్-4: రీ ఎంట్రీకి సిద్ధమైన కంటెస్టంట్ ఎవరంటే?

  తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. తన స్థానాన్ని బుల్లితెరపై మరింత పదిలం చేసుకునేందుకు కరోనా టైంలోనూ బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిర్వాహకులు బిగ్ బాస్-4ను కొనసాగిస్తునే ఉన్నారు. బిగ్ బాస్ కార్యక్రమంపై ఎన్ని విమర్శలు.. వివాదాలు చోటుచేసుకుంటున్న షో మాత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉంది. Also Read: మహేష్ ను ఇలా చూసి తట్టుకోగలమా? బిగ్ బాస్-4 సీజన్ ప్రేక్షకులు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2020 / 10:49 AM IST
    Follow us on

     

    తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. తన స్థానాన్ని బుల్లితెరపై మరింత పదిలం చేసుకునేందుకు కరోనా టైంలోనూ బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిర్వాహకులు బిగ్ బాస్-4ను కొనసాగిస్తునే ఉన్నారు. బిగ్ బాస్ కార్యక్రమంపై ఎన్ని విమర్శలు.. వివాదాలు చోటుచేసుకుంటున్న షో మాత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉంది.

    Also Read: మహేష్ ను ఇలా చూసి తట్టుకోగలమా?

    బిగ్ బాస్-4 సీజన్ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకోగా వారి అంచనాలను అందుకోలేకపోతుంది. బిగ్ బాస్-4 ప్రారంభ ఎపిసోడ్ కు గత సీజన్ల కంటే ఎక్కువగా టీఆర్పీ వచ్చింది. అయితే కంటెస్టెంట్లంతా పెద్దగా సెలబ్రెటీలు కాకపోవడంతో ప్రేక్షకులు ఈ షోను చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గంగవ్వ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు టీఆర్పీ బాగానే వచ్చినా క్రమంగా పడిపోతూ వచ్చింది.

    ప్రస్తుతం బిగ్ బాస్ 11వ వారంలో కొనసాగుతోంది. బిగ్ బాస్ చివరి అంకానికి చేరుతుండటంతో గేమ్ కూడా రసవత్తరంగా మారుతోంది. బిగ్ బాస్ లో ప్రస్తుతం కొనసాగుతున్న కంటెస్టెంట్లలో ఎవరూ కూడా టైటిల్ ఫేవరేట్ గా నిలువడం లేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్  ఎవరూ లేకపోవడంతో వారంతా కూడా టైటిల్ కోసం పోటీపడుతున్నారు. అయితే గతంలో హౌస్ నుంచి ఎలిమినేషన్ అయిన ఓ కంటెస్టెంట్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: ‘క్రాక్’తో సీరియస్ అయిన రవితేజ !

    బిగ్ బాస్-4 ఎలిమినేషన్స్ పై తొలి నుంచి ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు పంపించే ఓటింగ్ ను పక్కనబెట్టి బిగ్ బాస్ సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారనే ఆరోపణలు విన్పించాయి. దేవి నాగవెల్లి.. కుమార్ సాయి.. దివీ ఎలిమినేషన్లపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో నిర్వాహకులు విమర్శలు చెక్ పెట్టేందుకు రీ ఎంట్రీ అస్త్రాన్ని వాడుతున్నట్లు తెలుస్తోంది.

    ఈక్రమంలోనే బిగ్ బాస్ లోకి కుమార్ సాయి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అతడు క్వారంటైన్లో ఉన్నట్లు సమాచారం. అయితే  అతడి రీ ఎంట్రీ ఎప్పుడనేది మాత్రం బిగ్ బాస్ త్వరలోనే డిసైడ్ చేయాల్సి ఉంది. మొత్తానికి బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి ఎలిమినేట్ అయి.. రీ ఎంట్రీ కార్డుతో హౌస్ లోకి వెళ్లనుండటం ఆసక్తికరంగా మారింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్