ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దూకుడుకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న రమేశ్ ప్రయత్నాన్ని సీఎస్ దెబ్బకొట్టారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహణలో భాగంగా బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో కమిషనర్ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. దీనికి అనుమతి కోరుతూ సీఎస్ కు నిన్న నిమ్మగడ్డ లేఖ రాశారు. అయితే సీఎస్ నీలం సాహ్ని ఇప్పుడు ఎన్నికల నిర్వహణ అసాధ్యమని, కలెక్టర్లతో సమావేశం కూడా అవసరం లేదని ఘాటుగా స్పందించారు. దీంతో ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల కమిషన్ అన్నట్లుగా సాగుతోంది.
Also Read: సీఎం జగన్ రైట్ హ్యాండ్ ఎందుకు తప్పుకున్నాడబ్బా?
తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం మంగళవారం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ వెంటనే రాష్ట్రంలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైందని, ఇందుకు ప్రభుత్వ అధికారులు సహకరించాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీలు సుముఖత వ్యక్తం చేశాయన్నారు.
ఇందులో భాగంగా బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ ఏర్పాటు చేశారు. ఇందు కోసం అనుమతి కోరుతూ రమేశ్ సీఎస్ కు లేఖ రాశారు. రాజ్యంగం ప్రకారం ప్రమాణం చేసిన కొంతమంది స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, కరోనా పేరుతో ఎన్నికల నిర్వహణను అడ్డుకుంటున్నారని సీఎస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలని కమిషనర్ కోరారు.
Also Read: జగన్ పై కోడికత్తి కేసు.. ఆ పగ ఇప్పుడు నెరవేరిందట!
అయితే నిమ్మగడ్డ రాసిన లేఖపై సీఎస్ సాహ్ని ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం గ్రామాల్లో వైరస్ తీవ్రత ఇంకా తగ్గలేదన్నారు. పోలీసులు, ఇతర అధికారులు కరోనా వైరస్ నిర్మూలనకు చేసే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని, దీంతో ఇప్పడు ఎన్నికల నిర్వహణ అసాధ్యమన్నారు. ఇదిలా ఉండగా నిమ్మగడ్డ ముందస్తు ప్రణాళికతోనే దూకుడు పెంచాడని పలువురు అనుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కరోనా వైరస్ ప్రభావం తగ్గుతోందని. ఒక వేళ కరోనా ప్రభావం ఉన్నా కోవిడ్ నిబంధనలతో బీహార్, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించారని నిమ్మగడ్డ తెలిపారు. ఏపీలోనూ కోవిడ్ నిబంధనలతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా బుధవారం నిర్వహించే సమావేశానికి కలెక్టర్లు సహకరించకపోతే ఈ విషయాన్ని హైకోర్టుకు తీసుకెళ్లేందుకు ఎన్నికల కమిషనర్ సిద్ధమవుతున్నారు. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ కు సహకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. దీంతో నిమ్మగడ్డ ముందస్తు ప్రణాళికలతోనే ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఆ లేఖపై సీఎస్ స్పందనపై నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనన్న ఉత్కంఠ రాష్ట్రప్రజల్లో ఆసక్తి రేపుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్