చింత చచ్చినా పులుపు చావదన్నట్టు అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయినా కూడా ఆయన గుణం మాత్రం మారడం లేదు. ఎన్నికల్లో గెలిచిన జోబిడెన్ ను అధ్యక్షుడిగా అస్సలు ఒప్పుకోను అని అంటున్నాడు. ఎన్నికల్లో మోసాలను తన లీగల్ టీమ్ సేకరించిందని.. వాటిని సుప్రీంకోర్టు అందజేసిందని ట్రంప్ తెలిపారు.
Also Read: ట్రంప్ కొత్త పాట .! ఇప్పటికీ తానే విజేతనంటూ..!!
అయితే సుప్రీంకోర్టు తమ పిటీషన్లను విచారిస్తుందనే నమ్మకం తనకు కలుగడం లేదని ట్రంప్ చెప్పారు. ఇప్పటికే కోర్టులు తమ పిటీషన్లను తోసిపుచ్చుతున్నాయని.. పెన్సిల్వేనియా కోర్టు కూడా తిరస్కరించిందని ట్రంప్ గుర్తు చేశారు. జడ్జిలు అస్సలు సుముఖంగా లేరని ఆరోపించారు. ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.
Also Read: ఎట్టకేలకు పంతం వీడిన ట్రంప్.. బైడెన్ కు లైన్ క్లియర్..!
ఇప్పటికే ఒకసారి అధికార మార్పిడికి ఓకే అన్న ట్రంప్ తాజాగా మరోసారి మళ్లీ పాత పాటే పాడుతున్నారు. యూటర్న్ తీసుకున్నారు. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జోబిడెన్ గెలుపును అంగీకరించడానికి తాను సిద్ధంగా లేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఈసారి కొత్తగా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంపైనా తనకు అనుమానాలు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల అక్రమాలపై దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారిస్తుందనే నమ్మకం తనకు లేదని తేల్చిచెప్పారు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు
ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ట్రంప్ ఓ అమెరికన్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. బ్యాలెట్ పేపర్ల ఇంటర్వ్యూలో అక్రమాలు చోటుచేసుకున్నాయని.. ఆ కారణంగానే తాను మెజార్టీ రాష్ట్రాలను కోల్పోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేశారని విమర్శించారు. విస్కాన్సిన్, అరిజోనా, జార్జియా, మిన్నెసోటా, మిచిగాన్ వంటి రాష్ట్రాల్లో మెజారిటీని రాకుండా చేశారని ఆరోపించారు.