https://oktelugu.com/

అల్లు అర్జున్ బిగ్ గోల్స్.. విలక్షణంగా మారనున్నాడా?

  మెగా ఫ్యామిలీ అండతో అల్లు అర్జున్ టాలీవుడ్లో స్టైలీష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవిలాగే అల్లు అర్జున్ డాన్స్.. ఫైట్స్ తో మాస్.. క్లాస్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అల్లు అర్జున్ ఇటీవల నటించిన ‘అలవైకుంఠపురములో’ మూవీ ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అల్లు అర్జున్ సినిమాల్లో బీజీగా ఉంటూనే నిర్మాణ రంగంపై ఫోకస్ పెట్టి అందరిదృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. Also Read: తండ్రిని.. అన్నను తలుచుకొని నాగబాబు ఎమోషనల్   టాలీవుడ్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 30, 2020 / 01:00 PM IST
    Follow us on

    Allu Arjun

     
    మెగా ఫ్యామిలీ అండతో అల్లు అర్జున్ టాలీవుడ్లో స్టైలీష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవిలాగే అల్లు అర్జున్ డాన్స్.. ఫైట్స్ తో మాస్.. క్లాస్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అల్లు అర్జున్ ఇటీవల నటించిన ‘అలవైకుంఠపురములో’ మూవీ ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అల్లు అర్జున్ సినిమాల్లో బీజీగా ఉంటూనే నిర్మాణ రంగంపై ఫోకస్ పెట్టి అందరిదృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.

    Also Read: తండ్రిని.. అన్నను తలుచుకొని నాగబాబు ఎమోషనల్
     
    టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసిన అల్లు అర్జున్ గురించే చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ ఓవైపు సినిమాలతో బీజీగా ఉంటూనే మరోవైపు ఓటీటీ సిరీసుల నిర్మాణం.. మల్టిపెక్సులు.. స్టూడియోల నిర్మాణం చేపడుతోన్నారు. వీటికితోడు ‘ఆహా’ బ్రాండ్ కు ప్రమోషన్ చేస్తూనే కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తున్నాడు.

    Also Read: ఆర్.ఆర్.ఆర్ లో ఆ ఇద్దరు ఉంటారా?
     
    బన్నీ సినీరంగంలో మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ‘ఆహా’కు ప్రమోషన్స్ చేస్తున్న బన్నీ హైదరాబాద్లో భారీ స్టూడియోకు శ్రీకారం చుట్టిన సంగతి తెల్సిందే. అలాగే అమీర్ పేట సత్యం థియేటర్ స్థానంలో ‘ఏఏ’ పేరిట భారీ మల్టిపెక్స్ నిర్మిస్తున్నాడు. ఈక్రమంలోనే ఏఏ బ్రాండ్ ప్రతీచోట ఉండేలా ప్రణాళికతో ముందుకెళుతున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
     
    హీరోగా రాణిస్తున్న బన్నీ నిర్మాతగానూ.. స్డూడియో అధినేతగా.. బ్రాండ్ అంబాసిడర్ మల్టి రోల్స్ చేస్తున్నాడు. బన్నీ ప్రణాళికలు చూస్తుంటే బిగ్ గోల్స్ సెట్ చేసుకొని ఇండస్ట్రీని శాసించే స్థాయిలో వెళుతున్నట్లుగా కన్పిస్తోంది. బన్నీ తన బ్రాండ్ వాల్యూను మరింత విస్తరించుకునేలా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’లో నటిస్తున్న బన్నీ త్వరలోనే కొరటాలతో ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.