Janasena And BJP: ఏపీలో జనసేన బలం పెంచుకుంది. ఆ పార్టీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ ను ప్రత్యామ్నాయ నాయకుడిగా చూడడం ప్రారంభించారు. సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న చిత్తశుద్ధి కృషిని గుర్తిస్తున్నారు. పార్టీ మైలేజ్ కూడా గణనీయంగా పెరుగుతున్న సమయమిది. కానీ ఎందుకో అవకాశాన్ని జనసేనాని అందిపుచ్చుకోలేకపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొన్ని అంశాలపై స్పష్టతనివ్వకపోవడం పార్టీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కూటమి కడతారు? లేకుంటే తన చిరకాల మిత్రుడైన బీజేపీతో వెళతారా? ఒక వేళ వెళితే 175 స్థానాల్లో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీ చేస్తుంది? అసలు 175 నియోజకవర్గాల్లో రెండు పార్టీలకు క్యాండిడేట్స్ ఉన్నారా? ఓటర్లను సమీకరించి ఓటు వేయించే బూత్ కమిటీలు ఉన్నాయా? అధికార, విపక్షాలకు దీటుగా గ్రామస్థాయిలో పనిచేసేందుకు గ్రామ కమిటీలు ఏర్పాటుచేశారా? అసలు అటువంటి సన్నాహాలు ఏమైనా జరుగుతున్నాయా? అన్నదానిపై పార్టీ నాయకత్వం నుంచి శ్రేణులకు క్లారిటీ లేకుండా పోతోంది.

పొత్తుపై స్పష్టత లేదు..
పోనీ టీడీపీతో పొత్తు పెట్టుకొని ఆ గ్యాప్ కుదుర్చుకుందామని పవన్ అనుకుంటున్నారా? అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఎన్నికలు చూస్తే పట్టుమని రెండేళ్లు లేవు. అత్యంత కీలక సమయమిది. గత రెండు ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పవన్ వ్యవహరించాల్సిన అవసరముందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అన్ని అంశాలపై క్లారిటీ ఇస్తునే బాగుంటుందని సూచిస్తున్నారు. జగన్ తో పాటు వైసీపీ నాయకులు ఫలానా పార్టీకి బీటీమ్, దత్తపుత్రుడు అనేటప్పుడు తలవంచుకోవడ
మో.. లేకుంటే సమాధానం ఇవ్వలేక చిరాకు పడి తిట్టి వెళ్లిపోవడమో కాకుండా… వారి నోరు మూయించే నిర్ణయాలను ప్రకటిస్తే బాగుండేదని సగటు జనసైనికుడు కోరుతున్నాడు. 2024 ఎన్నికలకు వ్యూహరచన చేస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తే రెండేళ్ల పాటు నియోజకవర్గంలో పట్టు సాధించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు సిద్ధంగా ఉందని సంకేతాలు పంపించాలని కోరుతున్నారు.

బూత్ లెవల్ కమిటీలేవీ?
ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అవసరం ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలకు పడింది. అంతలా బలం పెంచుకున్నారు పవన్. అయితే ప్రజలకు ఓటు వేయాలని ఉన్నా.. బూత్ లెవల్ వరకూ వారిని తీసుకెళ్ల గల బూత్ కమిటీలను మాత్రం ఇంతవరకూ నియమించలేదు. ప్రస్తుతం అధికార వైసీపీకి, విపక్ష టీడీపీకి బూత్ లెవల్ కమిటీలు ఉన్నాయి. గ్రామ కమిటీలకు తోడుగా బూత్ కమిటీలు కూడా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. దీనికితోడు అధికార పార్టీ ప్రతీ 50 కుటుంబాలకు వలంటీరును నియమించింది. ప్రభుత్వ పథకాల అమలు, పౌరసేవలకుగాను వలంటీర్లను నియమించినట్టు ప్రభుత్వం చెబుతోంది. వారు పార్టీ మనుషులు కావడంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. స్థానిక సంస్థల్లో అధికార పార్టీ ఏకపక్ష విజయం వెనుక వలంటీర్ల పాత్ర ఉంది. అయితే వలంటీరు వ్యవస్థకు ధీటుగా తెలుగుదేశం పార్టీ ప్రతీ 50 మంది ఓటర్లకు ఒక ఇన్ చార్జిని నియమించింది. ఆ 50 మంది ఓటర్లకు ప్రభుత్వ వైఫల్యాలను తెలియజెప్పి వారిని టీడీపీ వైపు తిప్పుకోవడం ఇన్ చార్జి ప్రధాన విధి. మరోవైపు ఆ రెండు పార్టీలు సభ్యత్వ నమోదును కూడా గ్రామస్థాయిలో చురుగ్గా చేపడుతున్నాయి. అయితే ఈ విషయంలో జనసే, బీజేపీ కూటమిలు వెనుకబడ్డాయని ఇరు పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఇరు పార్టీలకు అన్ని జిల్లాల్లో బలమైన కేడర్ ఉంది. అన్ని మండలాలు, గ్రామ పంచాయతీల్లో కమిటీలు వేస్తే పార్టీ మరింత బలోపేతమవుతుంది. బూత్ కమిటీలు ఏర్పాటుచేస్తే ఓటర్లను సమీకించేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీలో బూత్ స్థాయి కమిటీలకు ప్రాధాన్యం ఎక్కువ. బూత్ కమిటీల ఆధారంగానే బీజేపీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. కానీ ఏపీకి వచ్చే సరికి మాత్రం కమిటీలు కానరాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఆశావహులు అధికం..
రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, బీజేపీ కూటమి నుంచి బరిలో దిగేందుకు నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలామంది జనసేన కీలక నేతలతో టచ్ లో ఉన్నారు. ఈ విషయంలో కూడా నాయకత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు. అధినేత గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో కూడా పవన్ స్పీడు పెంచాలని జనసేన శ్రేణులు కోరుతున్నాయి. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలంటున్నాయి. జనసేనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. కానీ అదే సమయంలో బలమైన అభ్యర్థులను బరిలో దించితే బాగుంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అనుభవం ఉన్న నాయకులను, సీనియర్లను చేర్చుకుంటే గెలుపు మరింత సులువు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. రాయలసీమతో పోల్చుకుంటే కోస్తా, ఉత్తరాంధ్రలో జనసేనకు బలం ఎక్కువ. కానీ రాయలసీమ నుంచి కూడా ఔత్సాహికులు జనసేన నుంచి పోటీకి దిగాలని సన్నాహాలు చేసుకుంటుండడం విశేషం. ఇందులో సుదీర్ఘ కాలం మంత్రి పదవులు చేపట్టిన వారు, సీనియర్ పార్లమెంటేరియన్లుగా వ్యవహరించిన వారు సైతం ఆసక్తి కనబరుస్తుండడం ప్రస్తావించాల్సిన విషయం. అందుకే నేతల చేరికకు గేట్లు తీయాలని జనసేన నాయకులు, కార్యకర్తలు అధినేతకు విన్నవిస్తున్నారు.
Also Read: MLC Driver Subrahmanyam: డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే.. ఇంతకీ ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ ఏమైనట్టు?
వ్యూహానికి పదును..
రాజకీయాల్లో పౌరుషాలు ఉండవు. వ్యూహాలు ఉంటాయని పవన్ చెప్పారు. అది నూటికి నూరు పాళ్లు నిజమే అయినా.. సరైన టైములో వ్యూహ రచన చేస్తేనే దానికి సార్ధకత కలుగుతుంది. అయితే టీడీపీతో పొత్తు రాజకీయ వ్యూహంలో భాగమే అనుకోవచ్చు. కానీ ముందస్తుగానే టీడీపీతో పొత్తుకు పిలుపునిస్తే.. అది జనసేనలో డొల్లతనాన్ని బయటపెడుతుందన్న ఆందోళన జనసేన శ్రేణులను వెంటాడుతోంది. ముందుగా పార్టీని బలోపేతం చేసి… అభ్యర్థులను ప్రకటిస్తే నియోజకవర్గాల్లో నేతలు పట్టు సాధిస్తారని.. తద్వారా పార్టీని గ్రామస్థాయిలో తీసుకెళ్లేందుకు అవకాశముంటుందని భావిస్తున్నారు. ఎన్నికల నాటికి పొత్తు అనివార్యమైతే బలం చాటుకొని వీలైనంత ఎక్కువ సీట్లు దక్కించుకునే అవకాశముంటుదని చెబుతున్నారు. కానీ ముందే స్నేహ హస్తం అందిస్తే మొదటి కే ఎసరు వస్తుందని ఆందోళన చెందుతున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీతో పొత్తు వికటించినా.. అటు టీడీపీ ఆశించిన స్థాయిలో సీట్లు ఇవ్వకపోయినా రెండిటికీ చెడ్డ రేవడీగా పరిస్థితి మారుతుందన్న ఆందోళన సగటు జనసైనికుడ్ని వెంటాడుతోంది. అందుకే ఎన్నికల వ్యూహాలను పక్కగా పదును పెట్టాలని అధి నాయకుడ్ని జనసేన శ్రేణులు విన్నవిస్తున్నాయి.
ఈజీగా అభ్యర్థులు..
జనసేన+బీజేపీ పొత్తు పొడిస్తే రెండు పార్టీల బలంతో ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాల్లో అభ్యర్థులు దొరకడం ఈజీనే. ఎందుకంటే ఇప్పటికే అధికార వైసీపీ ఓవర్ లోడ్ తో ఉంది. టీడీపీలో గెలుపుపై చాలా మంది నేతల్లో భయం ఉంది. ఈ క్రమంలోనే వీరంతా కలిసి జనసేన+బీజేపీ కూటమిలోకి ఎన్నికల వేళ రావడం సహజం.. వైసీపీ వ్యతిరేకులంతా కలిసి ఈ కూటమిలోకి వస్తారు. తద్వారా ఈజీగా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను సర్దుబాటు చేయవచ్చు. ఇక టీడీపీతో పొత్తు పొడిస్తే 75 సీట్లు టీడీపీ తీసుకుంటే చెరోసగం జనసే+బీజేపీ తీసుకోవచ్చు. అలా బలమైన నేతలను బరిలోకి దింపి గెలవొచ్చు. సో ఎలా చూసినా బీజేపీ+జనసేన కూటమికి ఏపీలో మొత్తం స్థానాల్లో పోటీచేసే సత్తా.. క్యాండిడేట్లు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: Amit Shah, Rahul Are Political Tourists: అమిత్ షా, రాహుల్ పొలిటికల్ టూరిస్టులు.. మరి కేసీఆర్?
Recommended Videos:
https://www.youtube.com/watch?v=iUtvpRtc5hE&t=11s
[…] […]