Homeలైఫ్ స్టైల్Chanakya Niti: చాణక్య నీతి: ఇలా చేస్తే ఎంతటి శత్రువైనా మీ ముందు తల వంచాల్సిందే!

Chanakya Niti: చాణక్య నీతి: ఇలా చేస్తే ఎంతటి శత్రువైనా మీ ముందు తల వంచాల్సిందే!

Chanakya Niti: శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టూనే ఉంటారు. మనం చేసే పనులు సాగకుండా అడ్డుపుల్లలు వేస్తూ మనకు నష్టాలు వచ్చేలా చేస్తారు. దీంతో శత్రువులను ఓడించడానికి అనేక మార్గాలు ఎంచుకుంటాం. వారిని ఎదుర్కొనేందుకు అన్ని దారులు వెతుకుతాం. శత్రువును దెబ్బకొట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డుతాం. మనకు అడ్డు వచ్చే వారిని నిరంతరం పక్కకు తప్పించేందుకు ప్రణాళికలు వస్తుంటాం. మన అభివృద్ధికి అడ్డుపడే వారి పట్ల జాగ్రత్తలు అవసరం. అందుకే మనం మన మనుగడలో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాల్సిందే.

Chanakya Niti
Chanakya Niti

మన గమ్యంలో చాలా మంది శత్రువులు తారసపడుతుంటారు. ఎలాగైనా మన పురోగమనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. విజయం సాధించేందుకు మనం చేసే పనులకు అడుగడుగునా అడ్డు తగులుతుంటారు. వారిని ఓడించేందుకు మనం కూడా ఆలోచనలు చేయాల్సిందే. చాణక్యుడు రచించిన రాజనీతి శాస్త్రంలో పలు విషయాలు వెల్లడించారు. ఎంత బలమైన శత్రువునైనా ఓడించడానికి పలు కోణాల్లో ప్రయత్నాలు చేస్తుండాల్సిందే.

Also Read: Power Cut In Pawan Kalyan Press Meet: పవర్ కట్ తో పకపక నవ్విన పవన్ కల్యాణ్?

ఎట్టి పరిస్థితుల్లో పిరికితనం ఆవహించకూడదు. ధైర్యాన్ని కోల్పోకూడదు. ఆలోచనలు సానుకూలంగా ఉండాలి. ఏ దశలో కూడా మనం మన ఆత్మస్థైర్యాన్ని తక్కువ చేసుకోవద్దు. చివరి వరకు పోరాడాలి. అప్పుడే విజయం మన సొంతం అవుతుంది. అందుకే కఠోర దీక్ష ఉండాల్సిందే. మన విజయాన్ని మనమే నిర్దేశించుకోవాలి. మన బాటను తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది.

Chanakya Niti
Enemies

శత్రువును తక్కువగా అంచనా వేయకూడదు. వారి బలాన్ని ఎక్కువగానే పరిగణించాలి. ఎంతటి బలహీనుడైనా బలవంతుడైనా ఎక్కడో ఒక చోట తప్పు చేస్తూనే ఉంటాడు. వారి బలం బలహీనతలను సరితూచి వారిని ఎదుర్కోవాలి. లేదంటే ఎంత బలమున్నా మనం ఓడిపోవడం ఖాయం. శత్రువును దెబ్బతీసే క్రమంలో పలు మార్గాలు అన్వేషించాలి.

తన కోపమే తన శత్రువు అన్నారు. అందుకే మనకు ఎప్పుడు కూడా కోపం రాకుండా చూసుకోవాలి. కోపం, తొందరతనం, అహంకారం దరి చేరితే నష్టమే. అందుకే ప్రశాంతంగా ఆలోచించాలి. సావధానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటులో తీసుకున్న డిసిషన్ తో అనర్థాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. శత్రువును ఎదుర్కొనేందుకు సహనంతో వ్యవహరించాలి. శత్రువు చేసే పొరపాట్లను లెక్కలోకి తీసుకుని వారిని దెబ్బతీసేందుకు ప్రయత్నించాలి. సహనంతోనే మన విజయం సాధ్యమవుతుందని తెలుసుకోవాలి.

Also Read: AP government: దావోస్ లోనూ అదే భజన.. అబద్ధాలను వండి వార్చుతున్న ఏపీ సర్కారు

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular