
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వేదికగా రైతులు ప్రారంభించిన నిరసన కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. హస్తిన శివార్లలో ప్రారంభించిన ఉద్యమం 23వ రోజుకు చేరుకుంది. ఢిల్లీ–హరియాణా సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ వద్ద వేలాది మంది రైతులు బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. అటు ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లోనూ రైతుల నిరసన కొనసాగుతోంది.
Also Read: శశికళ విడుదలకు ముహూర్తం ఖరారు
కొత్త సాగు చట్టాలను రద్దు చేసే వరకూ తమ ఉద్యమం విడిచేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. ప్రధాని మోడీ వెంటనే రైతులతో మాట్లాడాలని, చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు పోరాటం వదిలేదని అంటున్నారు. వీరి ఉద్యమానికి తగినట్లుగానే కేంద్రం నుంచి స్పష్టమైన వైఖరి వచ్చే వరకూ వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
మరోవైపు.. అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు ఇప్పటికే తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే పార్టీ మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా నేడు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ సహా పలువురు సీనియర్ నేతలు చెన్నైలో దీక్షలో కూర్చున్నారు. అన్నదాతలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించారు.
Also Read: ‘రైతుబంధు’కు మరొక అవకాశం..!
కాగా.. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలపై ప్రధాని మోడీ నేడు మధ్యప్రదేశ్ రైతులకు వివరించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్నారు. ఈ ప్రసంగం ద్వారా రైతులకు ఓ క్లారిటీ వస్తుందా..? ఉద్యమం ఇంతటితో ఆగుతుందా..? అనేది తేలాల్సి ఉంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్