తాగండి, చావండి, ఖజానా నింపండి, అన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఉందని బిజెపి నేత, మాజీ మంత్రి డి కె అరుణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఫించన్ , రైతు బంధు, జీతాలు ఇవ్వాలంటే లిక్కర్ ఆధాయమే మార్గమా? అని ఆమె ప్రశ్నించారు.
మద్యం అమ్మకాలపై ముఖం చాటేస్తున్న ప్రధాని మోదీ!
వానకు భయపడి ఆందోళన చెందుతున్న రైతులను ముఖ్యమంత్రి చిల్లరగాళ్లని అవమానిస్తారా? అంటూ అరుణ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజల ఆరోగ్యం కంటే రాష్ట్ర ఖజానానే కేసీఆర్ కు ముఖ్యమా? అంటూ ఆమె నిలదీశారు. రైతుల సమస్యలపై ఉన్న వాస్తవాలు మాట్లాడితే కేసీఆర్ కు కోపం వచ్చిందని ఆమె విమర్శించారు.
ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మాట్లాడిన మాటలు అయన స్థాయిని దిగజార్చాయని అరుణ మండిపడ్డారు. రైతు సమస్యల గురించి మాట్లాడిన ప్రతిపక్ష పార్టీ నాయకులను చిల్లర గాళ్లు, జోకర్లు, బఫూన్లు, సన్నాసులు అనడం సిగ్గు చేటని ఆమె దుయ్యబట్టారు.
జర్నలిస్టుల సమస్య.. కేసీఆర్ కు నిజంగా తెలియదా?
రాష్ట్ర ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక చౌకబారు మాటలు, అవహేళన మాటలు మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. ముఖ్య మంత్రి భాష తీరు ఇదేనా? అని అరుణ ప్రశ్నించారు. మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ చెప్పిన మాటలన్నీ అబద్దాలేనని, గంట సేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడని ఆమె దయ్యబట్టారు.
ప్రగతి భవన్ లో మీరు ఉన్నట్టు రైతులందరూ సుఖంగా లేరని చెబుతూ ధాన్యం కొనుగోలు సెంటర్ లలో రైతులు పడుతున్న ఇబ్బందులను ఒకసారి వెళ్లి చూడాలని ఆమె ముఖ్యమంత్రికి హితవు చెప్పారు. ధాన్యం నింపేందుకు సరిపోను గోనె సంచులు లేవని, లారీల ట్రాన్స్ పోర్టు సరిగ్గా లేదని విమర్శించారు.