స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పొడిగింపు..!

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎన్నికలను వాయిదా పొడిగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపేయాలని బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ఆదేశించారు. లాక్ డౌన్ పొడిగింపు, హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేతను కొనసాగిస్తున్నట్టు నోటిఫికేషన్లో వెల్లడించారు. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగుల తొలగించకుండా ఎన్నికలకు వెళ్లవద్దని హైకోర్టు సూచించిన ఆదేశాలను నోటిఫికేషన్లో ప్రస్తావించారు. లాక్ […]

Written By: Neelambaram, Updated On : May 6, 2020 6:11 pm
Follow us on


రాష్ట్రంలో స్థానిక సంస్థలకు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎన్నికలను వాయిదా పొడిగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపేయాలని బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ఆదేశించారు. లాక్ డౌన్ పొడిగింపు, హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేతను కొనసాగిస్తున్నట్టు నోటిఫికేషన్లో వెల్లడించారు. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగుల తొలగించకుండా ఎన్నికలకు వెళ్లవద్దని హైకోర్టు సూచించిన ఆదేశాలను నోటిఫికేషన్లో ప్రస్తావించారు.

లాక్ డౌన్ బాధిత ప్రజలపై పెట్రోల్ ధరల మోత

ఈ ఏడాది మార్చి 15వ తేదీన అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఎస్.ఈ.సి నిమ్మగడ్డ మార్చి 18వ తేదీన ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో మరోసారి ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రస్తుత ఎస్.ఈ.సి జస్టిస్ కనగరాజ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.