https://oktelugu.com/

కొత్త రూల్..మద్యం కొనాలంటే గొడుగు చూపించాలి!

అంధ్రప్రదేశ్ లో మద్యం షాపులకు వెళ్లి మద్యం కొనాలంటే గొడుగు రూల్ పెట్టారు. 40 రోజుల తర్వాత మద్యం షాపులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మద్యం బాబులు మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల మేర బారులు దీరుతున్నారు. సామాజిక దూరం పాటించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. గుంపులు గుంపులుగా ఎగబడి మద్యం కోసం యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపి అధికారులు కొత్త కండిషన్ తీసుకొచ్చారు. మద్యం కావాలంటే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 6, 2020 / 06:22 PM IST
    Follow us on

    అంధ్రప్రదేశ్ లో మద్యం షాపులకు వెళ్లి మద్యం కొనాలంటే గొడుగు రూల్ పెట్టారు. 40 రోజుల తర్వాత మద్యం షాపులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మద్యం బాబులు మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల మేర బారులు దీరుతున్నారు. సామాజిక దూరం పాటించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. గుంపులు గుంపులుగా ఎగబడి మద్యం కోసం యుద్ధం చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలో ఏపి అధికారులు కొత్త కండిషన్ తీసుకొచ్చారు. మద్యం కావాలంటే మాస్క్‌ తో పాటు గొడగు తప్పనిసరి ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు గొడుగు పట్టుకుంటే.. కాస్త దూరం దూరంగా నిలబడాల్సి వస్తుంది. అప్పుడు సహజంగానే భౌతిక దూరం పాటిస్తారు. ఈ క్రమంలోనే గొడుగు నిబంధన తీసుకొచ్చారు అధికారులు. ఇప్పటికే గుంటూరు జిల్లా తెనాలిలో గొడుగు నిబంధన పెట్టారు. అక్కడ అది వర్కవుట్ అయ్యి.. అందరూ సామాజిక దూరం పాటించారు. ఈ నేపథ్యంలో అంతటా గొడుగును తప్పనిసరి చేశారు.