దివ్య కేసులో చీకటి కోణాలు!

ఈనెల 3న దారుణ హత్యకు గురైన నల్లా దివ్య కేసులో చీకటి కోణాలు బయటపడుతున్నాయి. నిందితుల వ్యవహార శైలి, గత చరిత్ర కూపీ లాగితే దివ్య మరణం వెనుక అందం, ఆకర్షణ, ఆదాయం వంటి అనేక కోణాలు వెలుగు చూశాయి. నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కొత్త మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. హత్య కేసులో అనుమానితులైన ఐదుగురు మహిళలు ఒక యువకుడు సహా ఆరుగురు నిందితులు ఇప్పటికే రిమాండ్ లో వున్నారు. […]

Written By: Neelambaram, Updated On : June 10, 2020 6:55 pm
Follow us on

ఈనెల 3న దారుణ హత్యకు గురైన నల్లా దివ్య కేసులో చీకటి కోణాలు బయటపడుతున్నాయి. నిందితుల వ్యవహార శైలి, గత చరిత్ర కూపీ లాగితే దివ్య మరణం వెనుక అందం, ఆకర్షణ, ఆదాయం వంటి అనేక కోణాలు వెలుగు చూశాయి. నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కొత్త మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. హత్య కేసులో అనుమానితులైన ఐదుగురు మహిళలు ఒక యువకుడు సహా ఆరుగురు నిందితులు ఇప్పటికే రిమాండ్ లో వున్నారు. తదుపరి విచారణ కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేసి వీరిని కష్టడీ కోరాలని పోలీసులు నిర్ణయించారు.

దివ్య శరీరంపై 33 గాయాలతో మూడు రోజుల పాటు నీరు,ఆహారం లేకుండా చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు కోల్పోయింది. దివ్యకు ఆశ్రయం కల్పించి అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్న వసంత, ఆమె కుటుంబ సభ్యులే కారణమని పోలీసులు నిర్ధారించారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మరో ముగ్గురు అనుమానితులు బయటకు వచ్చారు. వీరిలో ఒకరు దివ్య భర్త  కాగా మరొకరు ఆమె బాబాయి. ఇంకొకరు  వసంత బంధువు.

పరారీ లో ఉన్న ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తే అర్ధాంతరంగా ముగిసిపోయిన దివ్య జీవితం వెనుక చీకటి కోణాలు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ. 2014లో అయినవారిని కోల్పోవడంతో ఆత్రేయపురంకి చెందిన దివ్య చిన్నమ్మ క్రాంతివేణి సంరక్షణలో పెరిగింది. ఆ తర్వాత ఏలేశ్వరానికి చెందిన వీరబాబుతో ఆమెకు వివాహమైంది. అనంతరం విశాఖలో స్థిరపడ్డారు. దివ్యను వ్యభిచార గృహం నిర్వాహకురాలు వసంతకు భర్తే అప్పగించినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ఇప్పటికే పోలీసు విచారణలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. దివ్య ముఖం గుర్తు పట్టకుండా ఉండేందుకు కనుబొమ్మలు కత్తిరించి గుండు చేయించి కాల్చి వాతలు పెట్టారు. బ్రతి కుండగానే నరకం అనుభవించిన దివ్య డెడ్ బాడీని సైతం గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసేందుకు ప్రయత్నించారు. దివ్యకు గుట్టు చప్పుడు కాకుండా అంత్య క్రియలు ముగించేయాలనే పధకం బెడిసి కొట్టింది. కరుడుగట్టిన ద్వేషమే కారణమని నిర్ధారించుకున్నారు