2022 Hurun Global Rich List: ‘హురున్ గ్లోబల్ రిచ్’ దేశంలోని టాప్ 10 ధనవంతుల సంపదనను తాజాగా లెక్కగట్టింది. ఇందులో ప్రపంచంలోనే టాప్ 10 బిలియనీర్ గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ దేశంలో అత్యంత సంపాదన పరుడుగా నిలిచాడు. ఆయనే మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.ఈ జాబితా ప్రకారం.. భారత బిలియనీర్లలో ముఖేష్ అంబానీ ఏకంగా 103 బిలియన్ డాలర్ల నికర సంపాదనతో మొదటి స్థానంలో ఉన్నారు.

ఇక భారత్ లో రెండో స్థానాన్ని గౌతం అదానీ సంపాదించారు. ఆయన 81 బిలియన్ డాలర్ల నికర సంపదతో రెండో స్థానాన్ని ఆక్రమించారు. ఇక శివ నాడార్ కుటుంబం 28 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది. సైరస్ పూనావాలా 26 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. లక్ష్మీ మిట్టర్ 25 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచారు.
Also Read: Jayalalitha Shoban Babu Daughter: జయలలిత, శోభన్ బాబు కూతురుని నేనే.. ఆధారాలు ఉన్నాయంటున్న మహిళ..
ఈ నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీ సంపద 24శాతం చొప్పున పెరిగింది. అతడి నికర సంపద 103 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ 9వ స్థానంలో ఉన్నారు. మరోవైపు గౌతం అదానీ తన సంపదలో 153శాతం వృద్ధిని నమోదు చేసుకున్నారు. ఈయన తాజాగా ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో 12వ స్థానంలో ఉన్నాడు.
హురున్ సంపన్నుల జాబితాలో మొదటి మూడు బిలియనీర్ లలో స్పేస్ ఎక్స్ , టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అమెజాన్ చైర్మన్ జెఫ్ బెజోస్, ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ అర్నాల్డ్ మూడో స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే వీరు టాప్ 3 కుబేరులు.
టాప్ 100 బిలియనీర్ల జాబితాలో ముగ్గురు భారతీయులు కొత్తగా చోటు సంపాదించారు. కరోనా వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్ స్టిట్యూట్ ఇండియా అధిపతి సైరస్ పూనావాలా 26 బిలియన్ డాలర్లతో 55వ స్థానంలో ఉన్నారు. ఆర్సెల్లర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ 60వ స్థానంలో. డీ మార్ట్ ఓనర్ దమానీ 23 బిలియన్ డాలర్లతో 67వ స్థానంలో ఉన్నారు.
వీరే కాక.. ఆదిత్య బిర్లా, దిలీప్ సంఘ్వీ, కోటక్ మహీంద్రా చైర్మన్ ఉదయ్ కోటక్, భారత దేశంలో అత్యంత సంపన్న వ్యక్తులుగా ఉన్నారు. వీరు హురున్ గ్లోబల్ రిచ్ 100 లిస్ట్ లో చోటు సంపాదించారు.
Also Read: Nara Lokesh’s Letter To Jagan: జగన్ కు నారా లోకేష్ లేఖ.. కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలట